logo

ఉడత తెచ్చిన తంటా

మండలంలోని కొప్పెరపాడు విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో పరివర్తకంపై ఉడతలు పడటంతో  శుక్రవారం పెద్ద శబ్దాలు వచ్చి మంటలు చెలరేగాయి. సుమారు రూ.1లక్ష విలువ చేసే ఇన్సూలేటర్‌ పూర్తిగా కాలిపోయింది. దీంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. 

Published : 02 Oct 2022 05:32 IST

మరమ్మతులు చేస్తున్న విద్యుత్తు సిబ్బంది

బల్లికురవ, న్యూస్‌టుడే:  మండలంలోని కొప్పెరపాడు విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో పరివర్తకంపై ఉడతలు పడటంతో  శుక్రవారం పెద్ద శబ్దాలు వచ్చి మంటలు చెలరేగాయి. సుమారు రూ.1లక్ష విలువ చేసే ఇన్సూలేటర్‌ పూర్తిగా కాలిపోయింది. దీంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.  శనివారం ఒంగోలు నుంచి వచ్చిన ప్రత్యేక సిబ్బంది మరమ్మతులు చేసేందుకు పనులు మొదలు పెట్టడంతో వర్షం కురిసింది. ఓపక్క వర్షం మరో పక్క ఉడత విద్యుత్తు సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని