logo

డ్రైవర్‌ సమయస్ఫూర్తి త్రుటిలో తప్పిన ప్రమాదం

ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి మంచాల కాలువలోకి ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లిన ఘటన స్థానిక మంచాల కాలువ వద్ద శనివారం సాయంత్రం జరిగింది. డ్రైవర్‌ సమయ స్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Published : 02 Oct 2022 05:32 IST

మంచాల కాల్వలోకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు (అంతర చిత్రంలో) డ్రైవర్‌ రమేష్‌

చేబ్రోలు, న్యూస్‌టుడే: ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి మంచాల కాలువలోకి ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లిన ఘటన స్థానిక మంచాల కాలువ వద్ద శనివారం సాయంత్రం జరిగింది. డ్రైవర్‌ సమయ స్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు, డ్రైవర్‌ రమేష్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చీరాల డిపోనకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు మధ్యాహ్నం 2 గంటల సమయంలో చీరాల నుంచి విజయవాడకు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. స్థానిక కొమ్మమూరు కాల్వ వద్దకు వచ్చేసరికి ఎదురుగా రెండు లారీలు రాసాగాయి. ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ యువకుడు వేగంగా ఆ లారీలను ‘ఓవర్‌ టేక్‌’ చేసి, ముందుకు దూసుకొచ్చాడు. ఆఖరి క్షణంలో అతన్ని గమనించిన బస్సు డ్రైవర్‌ బ్రేకులు వేశారు. అయితే వర్షం కారణంగా రోడ్డు తడిసి ఉండడంతో బస్సు జారుతూ రోడ్డు మార్జిన్‌ దిగింది. వెంటనే ఆయన ‘హ్యాండ్‌ బ్రేక్‌’ వేసి స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకున్నారు. దీంతో బస్సు ముందు  చక్రాలు కాలువలోకి దూసుకెళ్లడంతో అది ఓ పక్కకు ఒరిగి ఆగిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే డ్రైవర్‌ వారిని అప్రమత్తం చేస్తూ.. ఎవరూ  ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పి, అత్యవసర ద్వారం తెరిచి, అటుగా వెళుతున్న స్థానికుల సహకారంతో అందరినీ కిందకు దించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని