logo

విగ్రహాన్ని నిర్మించకుంటే ఉద్యమం ఉద్ధృతం

నగరపాలక సంస్థ అధికారులు బి.పి.మండల్‌ విగ్రహ నిర్మాణం దిమ్మెను కూల్చివేయడం దారుణమని బీసీ సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. అమరావతి రోడ్డులోని విగ్రహ స్థాపన ప్రదేశంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బి.పి.మండల్‌ విగ్రహ

Published : 02 Oct 2022 05:32 IST

బీపీ మండల్‌ విగ్రహ నిర్మాణ దిమ్మెను కూల్చిన ప్రదేశంలో నినాదాలు చేస్తున్న బీసీ సంఘాల నాయకులు

గోరంట్ల(గుంటూరు), న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ అధికారులు బి.పి.మండల్‌ విగ్రహ నిర్మాణం దిమ్మెను కూల్చివేయడం దారుణమని బీసీ సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. అమరావతి రోడ్డులోని విగ్రహ స్థాపన ప్రదేశంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బి.పి.మండల్‌ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు బి.పి.మండల్‌ విగ్రహ నిర్మాణ దిమ్మెను ధ్వంసం చేసి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారన్నారు. దిమ్మెను కూల్చి మూడు రోజులవుతున్నా అధికారులు తమకేం తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. యంత్రాంగం స్పందించకుంటే తాము ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని, విగ్రహ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌ మాట్లాడుతూ బీసీల కోసం ఎన్నో చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం బి.పి.మండల్‌ విగ్రహ నిర్మాణంలో చేసిందేమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ధ్వంసం చేసిన దిమ్మెను పునర్నిర్మించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. నిరసనలో బీసీ సంఘాల నాయకులు పి.ప్రసాదరావు, దాసరి శివకుమార్‌, సీహెచ్‌.వాసు, యు.సాంబశివరావు, నాగమల్లేశ్వరరావు, హనుమంతరావు, వీరు యాదవ్‌  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని