logo

98.54 శాతం మందికి పింఛన్ల పంపిణీ

జిల్లాలో వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక పథకం లబ్ధిదారుల్లో 98.54 శాతం మంది పింఛన్‌ సొమ్ము అందుకున్నారు. ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 05 Oct 2022 03:53 IST

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక పథకం లబ్ధిదారుల్లో 98.54 శాతం మంది పింఛన్‌ సొమ్ము అందుకున్నారు. ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు జిల్లాలో మొత్తం 2,34,573 మంది లబ్ధిదారులకు రూ.59.64 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మంగళవారం వరకు 2,31,155 మందికి రూ.58.75 కోట్లను అందజేశారు. పల్నాడు జిల్లాలో 2,65,465 మంది లబ్ధిదారులకు రూ.67.87 కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా.. 2,61,729 మందికి రూ.66.91 కోట్లను పంపిణీ చేశారు. 98.59 శాతం మందికి పింఛన్లు అందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని