logo

జిల్లాలో 1877 పోలింగ్‌ కేంద్రాలు

పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌పై వివిధ రాజకీయ పక్షాలతో కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాలులో సమావేశమయ్యారు.

Published : 05 Oct 2022 03:53 IST

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌పై వివిధ రాజకీయ పక్షాలతో కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాలులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 1877 పోలింగ్‌ కేంద్రాలున్నాయని, 38 కేంద్రాల లోకేషన్లు మార్పు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పది పోలింగ్‌ కేంద్రాలకు పేర్లు మార్పు చేసినట్లు వివరించారు. కొత్తగా రెండు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయని తెలిపారు. వీటిని ఎన్నికల కమిషన్‌కు పంపుతామన్నారు. ఓటరుకు ఆధార్‌ సంఖ్య అనుసంధానం ప్రక్రియ 6బి ఫారంలో సేకరిస్తున్నామన్నారు. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో డూప్లికేట్‌ ఓటర్లను, చనిపోయిన ఓటర్ల తొలగింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ తాడికొండ పరిధిలోని పోలింగ్‌ కేంద్రం 81లో 1053 ఓట్లు ఎస్సీ వర్గానివి ఉన్నాయన్నారు. వారికి అక్కడే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధి మీనా, నగర కమిషనర్‌ చేకూరి కీర్తి, డీఆర్‌వో కె.చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎల్‌.ఈశ్వరరావు, భాజపా తరపున భాస్కరరావు, వైకాపా తరపున సాంబశివరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని