logo

రుణాల మాయాజాలంపై ‘నాటిక’ శస్త్రం.. దారుణం

కళల కాణాచి, వేదగంగోత్రి ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయి ద్వితీయ సాంఘిక నాటికల పోటీలను మంగళవారం రాత్రి తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో నిర్వహించారు.

Published : 05 Oct 2022 06:15 IST

‘దారుణం’ నాటికలోని ఓ సన్నివేశం

తెనాలి(కొత్తపేట): కళల కాణాచి, వేదగంగోత్రి ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయి ద్వితీయ సాంఘిక నాటికల పోటీలను మంగళవారం రాత్రి తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో నిర్వహించారు. హైదరాబాద్‌ భవతి వారు రచయిత పరమాత్ముని శివరామ్‌ రచించి, దర్శకత్వం వహించిన ‘దారుణం’ నాటికను అద్భుతంగా ప్రదర్శించారు. యువత రుణయాప్‌లు, సైబర్‌ నేరగాళ్ల మాయలో చిక్కుకుని, వివిధ రకాల రుణాలు తీసుకొని చెల్లించలేక సతమతమవుతూ బలవన్మరణాలకు పాల్పడతున్నారని, జీవితం ఎంతో గొప్పదని, ప్రాణాలు తీసుకోవద్దనే సందేశాన్ని చాటి చెప్పారు. అలాగే ప్రత్యేక ప్రదర్శనగా విజయవాడ ‘న్యూ స్టార్‌ మోడరన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌’ వారు ‘పిపీలకం’ నాటికను చక్కగా ప్రదర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని