logo

గ్రైండర్‌ స్విచ్‌ వేస్తుండగా విద్యుదాఘాతం..

చేతికంది వచ్చిన ఒక్కగానొక్క కుమారుడిని తీసుకెళ్లావేమయ్యా.. వాడు లేకుండా మేం ఎలా బతకాలి దేవుడా అంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. గ్రైండర్‌ స్విచ్‌వేస్తూ విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం పట్టణంలో వెలుగుచూసింది.

Published : 07 Oct 2022 06:14 IST

యువకుడి మృత్యువాత

శంకర్‌ (పాతచిత్రం)

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: చేతికంది వచ్చిన ఒక్కగానొక్క కుమారుడిని తీసుకెళ్లావేమయ్యా.. వాడు లేకుండా మేం ఎలా బతకాలి దేవుడా అంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. గ్రైండర్‌ స్విచ్‌వేస్తూ విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం పట్టణంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కారంపూడికి చెందిన సూరి శ్రీను, శివమ్మ దంపతులకు ఒక్కగానొక్క సంతానం శంకర్‌(19). జీవనోపాధి రీత్యా ఐదేళ్లక్రితం ఆ కుటుంబం పట్టణంలోని రెండోవార్డులోని రంగాకాలనీకి వచ్చి నివాసం ఉంటోంది. ఏడో తరగతి వరకు చదివిన శంకర్‌ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఓ హోటల్‌లో కార్మికుడిగా గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. రోజూలాగే హోటల్‌కు వెళ్లిన అతడు పచ్చడి తయారీకి గ్రైండర్‌ వేశాడు. వర్షానికి గ్రైండర్‌ స్విచ్‌బోర్డు తడిచి విద్యుదాఘాతం సంభవించింది. అక్కడ ఉన్న వారు వెంటనే శంకర్‌ను ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందాడు. కుమారుడి మరణవార్త తెలుసుకుని అతడి తల్లిదండ్రులు శ్రీను, శివమ్మ తల్లడిల్లారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శోభన్‌బాబు తెలిపారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని