logo

జిల్లా ఆస్పత్రిలో రోగికి అరుదైన శస్త్రచికిత్స

జిల్లా ఆసుపత్రి ఆర్థోపెడిక్‌ విభాగ వైద్యుడు రాకేష్‌ గూడ ఎముక విరిగిన రోగికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆ రోగి కోలుకున్నారు. డాక్టర్‌ రాకేష్‌ గురువారం ఆస్పత్రిలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి

Published : 07 Oct 2022 06:14 IST

శస్త్రచికిత్స చేసిన డాక్టర్‌ రాకేష్‌.  పక్కన వైద్యురాలు మజీదాబీ

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: జిల్లా ఆసుపత్రి ఆర్థోపెడిక్‌ విభాగ వైద్యుడు రాకేష్‌ గూడ ఎముక విరిగిన రోగికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆ రోగి కోలుకున్నారు. డాక్టర్‌ రాకేష్‌ గురువారం ఆస్పత్రిలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ ప్రమాదంలో భుజంలోని గూడ ఎముక విరిగిన ఇస్రాయిల్‌ అనే వ్యక్తి చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలో చేరారు. అతన్ని పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. సాధారణంగా రోగికి పెద్దమొత్తంలో మత్తు మందు ఇచ్చి ఈ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అయితే అందుకు అతని శరీరం సహకరించనందున తాము ఎముక విరిగిన భుజం ప్రాంతం వరకే మత్తు ఇచ్చి, శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసినట్టు డాక్టర్‌ రాకేష్‌ తెలిపారు. ఈ బృందంలో డాక్టర్‌ పి.వెంకటేశ్వరరావు, మత్తు వైద్య నిపుణురాలు డాక్టర్‌ మజీదాబీ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని