logo

‘ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవాలి’

‘వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అన్ని వర్గాలవారు మోసపోయారు. ఈ ప్రభుత్వం ఏవిధంగా మోసగించిందో ప్రజలకు వివరించి అనుకూలంగా మలచుకోవాలి’... అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సూచించారు

Published : 07 Oct 2022 06:18 IST

చంద్రబాబుతో మాట్లాడుతున్న యరపతినేని శ్రీనివాసరావు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ‘వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అన్ని వర్గాలవారు మోసపోయారు. ఈ ప్రభుత్వం ఏవిధంగా మోసగించిందో ప్రజలకు వివరించి అనుకూలంగా మలచుకోవాలి’... అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావు పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును కలిసి పలు విషయాలపై చర్చించారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో గురజాల నియోజకవర్గాన్ని ద్వితీయ స్థానంలో నిలపడం పట్ల యరపతినేనిని చంద్రబాబు అభినందించారు. పల్లె పిలుస్తుంది కార్యక్రమం కూడా బాగానే జరుగుతుందని, ఇంకా విస్తృతం చేయాలని సూచించారు. వర్షాల వల్ల ఈ కార్యక్రమానికి కొంత అంతరాయం కలిగిందని, మళ్లీ ప్రారంభిస్తామని యరపతినేని చెప్పారు. ‘పల్నాడులో వైకాపా అరాచకాలు, హత్యల్ని సమర్థంగా ఎదుర్కొంటున్నారు. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు. ఓటర్ల జాబితా పట్ల అప్రమత్తంగా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలి. అందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకోవాలి’.. అని చంద్రబాబు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని