logo

హకీంజానీకి ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు’లో చోటు

బాలసాహితీ వేత్త షేక్‌ అబ్దుల్‌ హకీంజానీ ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు’కు ఎంపికయ్యారు. ఈయన తెలుగు దిన, వారపత్రికల ఆదివారం అనుబంధాలకు అనేక వాస్యాలు రాశారు. అందులో 1,400కు పైగా ప్రచురితమయ్యాయి.

Published : 07 Oct 2022 06:18 IST

ధ్రువపత్రాన్ని జానీకి అందించిన దర్శకుడు వినాయక్‌, హాస్యనటుడు రఘుబాబు. పక్కన సినీ మాటల రచయిత సాయిమాధవ్‌, వరప్రసాద్‌

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: బాలసాహితీ వేత్త షేక్‌ అబ్దుల్‌ హకీంజానీ ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు’కు ఎంపికయ్యారు. ఈయన తెలుగు దిన, వారపత్రికల ఆదివారం అనుబంధాలకు అనేక వాస్యాలు రాశారు. అందులో 1,400కు పైగా ప్రచురితమయ్యాయి. ఈ అరుదైన ఘనత సాధించినందుకుగాను ఈయనకు ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కింది. ఈ విషయాన్ని దాని వ్యవస్థాపక సంపాదకుడు డాక్టర్‌ కె.వివేకానందబాబు ఈనెల 4న జానీకి తెలియజేశారు. సంబంధిత ధ్రువపత్రాన్ని కూడా పంపించారు. దాన్ని ప్రసిద్ధ సినీ దర్శకుడు వి.వి.వినాయక్‌, హాస్యనటుడు రఘుబాబులు అదే రోజు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జానీకి అందజేశారు. ఇప్పటికే ఆయన వండర్‌, తెలుగు బుక్‌ ఆఫర్‌ రికార్డ్సు, ఏషియన్‌ వరల్డ్‌ రికార్డ్సుకు ఎంపికయ్యారు. అంతేకాదు.. ఆయన రాసిన కథలు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పదుకొండు, పన్నెండో తరగతుల తెలుగు పాఠ్య పుస్తకాల్లో ముద్రితమయ్యాయి. ఈ వివరాలను జానీ గురువారం తెనాలిలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని