logo

భగ్గుమంటున్నాయ్‌

ఇసుక, మట్టి తవ్వకాల విషయంలో పొడచూపిన స్పర్థలు యంత్రాలు కాలే వరకు చేరుతున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా సాధారణ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇసుక, కొండగ్రావెల్‌ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తరువాతనే తవ్వకాలు చేపట్టాలి.

Published : 08 Oct 2022 04:23 IST

ఆధిపత్యం కోసం యంత్రాల దహనం

అద్దంకి, న్యూస్‌టుడే

అద్దంకి కొండపై కాలిన పొక్లెయిన్‌(పాతచిత్రం)

ఇసుక, మట్టి తవ్వకాల విషయంలో పొడచూపిన స్పర్థలు యంత్రాలు కాలే వరకు చేరుతున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా సాధారణ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇసుక, కొండగ్రావెల్‌ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తరువాతనే తవ్వకాలు చేపట్టాలి. ఎలాంటి అనుమతులు లేకున్నా జగనన్న కాలనీలకు ఇసుక, గ్రావెల్‌ సరఫరా కోసం కొండలు, వాగుల్లో తవ్వకాలు చేస్తున్నారు. దీనిపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ తవ్వకాల విషయంలో ఒకే ఛత్రం కింద ఉన్న కార్యకర్తలు, నాయకుల మధ్య భేదాభిప్రాయాలు పొడచూపుతున్నాయి. ఫలితంగా తవ్వకాలకు ఉపయోగించే వాహనాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. అద్దంకి, ముండ్లమూరు మండలాల్లో జరిగిన సంఘటనలు ఒకేరీతిలో ఉండటంతో ఈ అంశానికి ప్రాధాన్యం పెరిగింది.

* జగనన్న కాలనీలకు అద్దంకి కొండపై గ్రావెల్‌ తవ్వకాలను గతనెల మొదటి వారంలో చేపట్టారు. పదిరోజుల పాటు తవ్విన తరువాత స్థానికులు కొందరు తాము గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతామంటూ ముందుకొచ్చారు. దీంతో వారి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే గతనెల 12న అద్దంకి కొండపైన ఉన్న పొక్లెయిన్‌ అగ్నికి ఆహుతైంది. దీని విలువ రూ.25 లక్షల వరకు ఉంటుంది. గ్రావెల్‌ తవ్వకాలకు పోటీపడిన వారే ఈ దురాగతానికి పాల్పడినట్లు తవ్వకందారులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

* త్రివేణి సంగమం(అద్దంకి, ముండ్లమూరు, తాళ్లూరు) మండలాల సరిహద్దులోని చిలకలేరు వాగులో కొంతకాలంగా ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మూడు మండలాల నుంచి ముగ్గురు నాయకులు వీటిని పర్యవేక్షిస్తున్నారు. గతనెలాఖరులో చిలకలేరులో ఇసుక తవ్వుతున్న పొక్లెయిన్‌ ఇంజిన్‌భాగం అగ్నిప్రమాదానికి గురైంది. సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు స్థానికులు అంచనా వేస్తున్నారు.

తక్షణం చేపట్టాల్సిన చర్యలు

* ఇసుక, గ్రావెల్‌ తవ్వకం జరిగే ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించాలి. తవ్వకందారుల నుంచి రుసుం వసూలు చేసేందుకు అనుతించాలి. * తవ్వకం జరిగే ప్రదేశంలో అవాంఛనీయ సంఘటనలు జరగడకుండా బందోబస్తు, పహారా ఉంచాలి

* అవసరమైతే నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తే అనర్థాలకు తావుండదు.

* సంబందిత గ్రామ సచివాలయ ఉద్యోగుల పర్యవేక్షణ అవసరం.

పోలవరం శివారు చిలకలేరులో కాలిన పొక్లెయిన్‌​​​​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని