logo

ఈ తప్పుడు లెక్కలేెంటి?

తాము తీసుకున్న రుణం కంటే అధికంగా ఇచ్చినట్లు పాసు పుస్తకాల్లో నమోదు చేశారని, అలాగే చెల్లించిన బకాయిల మొత్తం జమ చేయకుండా మోసం చేశారంటూ బొల్లాపల్లి మండలం సరికొండపాలెం తండా సుగాలీ మహిళలు శుక్రవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వినుకొండ శాఖలో ఆందోళనకు దిగారు.

Published : 08 Oct 2022 04:23 IST

బ్యాంకు సిబ్బందితో మహిళల వాగ్వాదం

ఆందోళన చేస్తున్న డ్వాక్రా మహిళలు

వినుకొండ, న్యూస్‌టుడే : తాము తీసుకున్న రుణం కంటే అధికంగా ఇచ్చినట్లు పాసు పుస్తకాల్లో నమోదు చేశారని, అలాగే చెల్లించిన బకాయిల మొత్తం జమ చేయకుండా మోసం చేశారంటూ బొల్లాపల్లి మండలం సరికొండపాలెం తండా సుగాలీ మహిళలు శుక్రవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వినుకొండ శాఖలో ఆందోళనకు దిగారు. 24 గ్రూపులను ఇలాగే మోసం చేశారని ఆరోపించారు. పొదుపు సంఘాల మహిళలు తమ కుటుంబ సభ్యులతో ఉదయం బ్యాంకు వద్దకు చేరుకున్నారు. మేనేజర్‌ లేకపోవడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తాము రూ.4 లక్షలు అప్పు తీసుకుంటే రూ.10 లక్షలు ఇచ్చినట్లు పాసు పుస్తకంలో ఎలా నమోదు చేశారని ఆంజనేయ మహిళా పొదుపు సంఘం సభ్యులు జ్యోతిబాయి, కోటమ్మబాయి నిలదీశారు. ఆలాగే తీసుకున్న అప్పునకు చెల్లించిన డబ్బుతో పాటు పొదుపు ఖాతాకు జమ చేసిన సొమ్ములో తేడాలున్నాయని తెలిపారు. వచ్చిన మిగిలిన పొదుపు సంఘాల మహిళలు వారితో గొంతు కలిపి గట్టిగా కేకలు వేయడంతో గందరగోళం నెలకొంది. ఈ సమయంలో అక్కడే ఉన్న బ్యాంకు తనిఖీ అధికారులతో పాటు వివిధ సహకార సంఘాల కార్యదర్శులు జోక్యం చేసుకొని వారిని సముదాయించారు. మేనేజర్‌ వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా శాంతించి తిరిగి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని