logo

ఒక్కో సినిమాకు ఒక్కో సెన్సార్‌ బోర్డు ఏర్పాటు చేస్తారా?: దర్శకుడు దిలీప్‌రాజా

‘ఆదిపురుష్‌’ వంటి సినిమాల కోసం సనాతన సెన్సార్‌బోర్డు ఏర్పాటుచేయాలని రాజస్థాన్‌ మంత్రి చేసిన డిమాండ్‌ అభ్యంతరకరమని, ఇది సరికాదని సినీ దర్శకుడు, కేంద్ర సెన్సార్‌ బోర్డు మాజీ సభ్యుడు దిలీప్‌రాజా చెప్పారు.

Updated : 12 Oct 2022 06:52 IST


మాట్లాడుతున్న దిలీప్‌రాజా

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: ‘ఆదిపురుష్‌’ వంటి సినిమాల కోసం సనాతన సెన్సార్‌బోర్డు ఏర్పాటుచేయాలని రాజస్థాన్‌ మంత్రి చేసిన డిమాండ్‌ అభ్యంతరకరమని, ఇది సరికాదని సినీ దర్శకుడు, కేంద్ర సెన్సార్‌ బోర్డు మాజీ సభ్యుడు దిలీప్‌రాజా చెప్పారు. మంగళవారం పెదరావూరులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలా ఒక్కో సినిమాకు ఒక్సో సెన్సార్‌ బోర్డు ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు.

ఈ సినిమాపై కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరగడం, అక్కడి రాజకీయ నాయకులు వాటికి మద్దతు తెలపడం సహేతుకం కాదన్నారు. సినిమా వల్ల ఎవరి మనో భావాలైనా దెబ్బతింటే వారు ‘రివైజింగ్‌ కమిటీ’ని కోరే అవకాశం ఉందన్నారు. ఏ మతస్థుల మనోభావాలూ దెబ్బతినేలా సినిమాలు తీయడం సరికాదని, ఇది కచ్చితంగా అందరూ అంగీకరిస్తారని, కానీ వాస్తవిక కోణంలో ఆలోచించాల్సి ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని