logo

అంగన్‌వాడీ కేంద్రాలు పునర్వ్యవస్థీకరణ

పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే కోవలో స్త్రీ శిశు సంక్షేమశాఖ పరిధిలో ఉన్న అంగన్‌వాడీ ప్రాజెక్ట్‌ల్లో పక్క జిల్లాలో ఉన్న మండలాలను ఆ జిల్లా పరిధిలోకి మార్పులు చేస్తూ ఆశాఖ కమిషనరు ఇటీవల విలీనం ఉత్తర్యులు జారీ చేశారు.

Published : 27 Nov 2022 05:56 IST

జిల్లా సరిహద్దు మండలాల్లో సర్దుబాట్లు

పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే కోవలో స్త్రీ శిశు సంక్షేమశాఖ పరిధిలో ఉన్న అంగన్‌వాడీ ప్రాజెక్ట్‌ల్లో పక్క జిల్లాలో ఉన్న మండలాలను ఆ జిల్లా పరిధిలోకి మార్పులు చేస్తూ ఆశాఖ కమిషనరు ఇటీవల విలీనం ఉత్తర్యులు జారీ చేశారు. దీని ప్రకారం బాపట్ల జిల్లాలో గతంలో మాదిరిగానే 9 ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అయితే పూర్వపు ప్రాజెక్ట్‌ అయినా వేటపాలెంలో ఉన్న నాగులుప్పలపాడు మండలాన్ని ప్రకాశం జిల్లాలో ఉన్న మద్దిపాడు ప్రాజెక్ట్‌కి మార్పు చేశారు. చీరాల మండలాన్ని చీరాలకు బదిలీ చేశారు. ఇక పర్చూరు ప్రాజెక్ట్‌లో ఉన్న ఇంకొల్లును వేటపాలెం కిందకు తీసుకొచ్చారు. దీని కింద ఉన్న కారంచేడును చీరాలలో కలిపారు. సంతమాగులూరు కింద ఉన్న యద్దనపూడి, మార్టురును ఇప్పుడు పర్చూరులోకి మార్చారు. గుంటూరు జిల్లా తెనాలి పరిధిలో ఉన్న చుండూరును అమృతలూరు ప్రాజెక్ట్‌లోకి చేర్చారు.

- న్యూస్‌టుడే, చీరాల అర్బన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని