logo

గడువు తీరిన చిరుతిండి విక్రయాలు

కాలం చెల్లిన చిరుతిండి ప్యాకెట్లు తిన్న నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక కాకతీయ కల్యాణ మండపం సమీపంలోని ఓ కిరాణా దుకాణంలో నలుగురు చిన్నారులు కుర్‌కురే ప్యాకెట్లు కొనుగోలు చేసి తిన్నారు.

Published : 27 Nov 2022 05:56 IST

అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారులు


కిరాణ దుకాణం వద్ద తల్లిదండ్రుల ఆందోళన

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : కాలం చెల్లిన చిరుతిండి ప్యాకెట్లు తిన్న నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక కాకతీయ కల్యాణ మండపం సమీపంలోని ఓ కిరాణా దుకాణంలో నలుగురు చిన్నారులు కుర్‌కురే ప్యాకెట్లు కొనుగోలు చేసి తిన్నారు. కాసేపటికి వారు కడుపు నొప్పితో విలవిల్లాడుతూ వాంతులు చేసుకున్నారు. వేర్వేరుగా తల్లిదండ్రులు ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా కుర్‌కురేలు తిని వాంతులు చేసుకున్నట్లు పిల్లలు ఆయనకు చెప్పారు. 11 ఏళ్ల వైభవ్‌ అనే చిన్నారిని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. వైభవ్‌తోపాటు ఆ ప్యాకెట్లు తిన్న చిన్నారుల తల్లిదండ్రులు దుకాణం వద్ద శనివారం రాత్రి ఆందోళన చేశారు. పిల్లలు తిన్న ప్యాకెట్లు పరిశీలించగా వాటి కాలపరిమితి ఈ ఏడాది జనవరితోనే ముగిసినట్లు ఉంది. కాలం చెల్లిన ప్యాకెట్లు ఎలా అమ్ముతున్నారంటూ వ్యాపారిని ప్రశ్నించారు. ఈ రోజు మధ్యాహ్నమే పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ సమీపంలోని హోల్‌సేల్‌ వర్తకుడు వాటిని ఇచ్చారని, తాను చూసుకోలేదని వ్యాపారి చెప్పారు. పిల్లల తల్లిదండ్రుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై కిషోర్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని విచారించారు. దుకాణాన్ని మూసేయించి వ్యాపారిని స్టేషన్‌కు తరలించారు. ఆహార కలుషితంపై విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

2022 జనవరితో కాల పరిమితి ముగిసినట్లు ఉన్న వివరాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని