logo

ఇళ్లు నిర్మించుకుని... వెర్రివాళ్లమయ్యాం

జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకుని వెర్రివాళ్లమయ్యామని, సౌకర్యాలు ఎప్పుడు కల్పిస్తారని జిల్లా పంచాయతీ అధికారి కేశవరెడ్డిని ఓ మహిళ ప్రశ్నించింది.

Updated : 27 Nov 2022 06:19 IST

డీపీవోను ప్రశ్నించిన ఓ మహిళ


డీపీవో కేశవరెడ్డిని ప్రశ్నిస్తున్న ఓ మహిళా లబ్ధిదారు

తుమ్మలపాలెం(ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకుని వెర్రివాళ్లమయ్యామని, సౌకర్యాలు ఎప్పుడు కల్పిస్తారని జిల్లా పంచాయతీ అధికారి కేశవరెడ్డిని ఓ మహిళ ప్రశ్నించింది. గృహ నిర్మాణ లబ్ధిదారులతో శనివారం డీపీవో సమావేశం నిర్వహించారు. జగనన్న కాలనీలో 18 మంది ఉంటున్నామని, వీధి దీపాలు లేవని, పైపులైను దెబ్బతిని తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటూ వాపోయింది. సదుపాయాలు లేకుండా నిర్మించుకుని వెర్రివాళ్లమయ్యామని ఆవేదన వ్యక్తం చేసింది. వీధి లైటు వేయాలని అడిగితే రూ.100లతో బల్బు ఏర్పాటు చేసుకోలేవా..అంటూ పంచాయతీ రాజ్‌ ఏఈ హేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని