logo

భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదాలు

సామర్థ్యానికి మించి లోడుతో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న భారీ వాహనాలను మహిళలు, స్థానికులు అడ్డుకున్న ఘటన యద్దనపూడిలో సోమవారం చోటుచేసుకుంది.

Published : 29 Nov 2022 04:51 IST

టిప్పర్లను అడ్డుకుని నిరసన తెలుపుతున్న స్థానికులు

యద్దనపూడి, న్యూస్‌టుడే: సామర్థ్యానికి మించి లోడుతో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న భారీ వాహనాలను మహిళలు, స్థానికులు అడ్డుకున్న ఘటన యద్దనపూడిలో సోమవారం చోటుచేసుకుంది. భారీ లోడుతో కొండరాళ్లను తీసుకెళ్తున్న ఐదు టిప్పర్లు నిలిపివేశారు. అనుమతి మేరకు గ్రామీణ రహదారులపై రవాణా సాగించాలని నిరసన తెలిపారు. బల్లికురవ మండలంలోని క్వారీ నుంచి రాళ్లను సూరవరపుపల్లె, అనంతవరం, యనమదల, యద్దనపూడి, జాగర్లమూడి గ్రామాల మీదుగా పర్చూరు, చీరాలకు ప్రమాదకరంగా తరలిస్తున్నారని ఆక్షేపించారు. సుమారు 40 టన్నుల పైగా రాళ్లతో వాహనాలు వేగంగా ప్రయాణిస్తుండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని