logo

బ్యాక్‌లాగ్‌లో అవకాశమివ్వరూ..!

దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల నోటిఫికేషన్‌లో అంధుల పోస్టుకు స్త్రీల నుంచి అభ్యర్థులు లేకపోతే.. ఆ స్థానంలో పురుషులను నియమించాలని కోరుతూ దివ్యాంగులు సోమవారం స్పందనలో అర్జీని అందించారు.

Published : 29 Nov 2022 04:51 IST

న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(గుంటూరు): దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల నోటిఫికేషన్‌లో అంధుల పోస్టుకు స్త్రీల నుంచి అభ్యర్థులు లేకపోతే.. ఆ స్థానంలో పురుషులను నియమించాలని కోరుతూ దివ్యాంగులు సోమవారం స్పందనలో అర్జీని అందించారు. స్త్రీ అభ్యర్థులు లేకుంటే పురుషులకు అవకాశం ఇవ్వాలని ఉత్తర్వులున్నా ఇటీవల నోటిఫికేషన్‌లో ఆ అవకాశం ఇవ్వలేదని, అధికారులు స్పందించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అంధులైన పురుషులకు అవకాశం కల్పించాలని విన్నవించారు. వినతిని ఇచ్చేందుకు వినోద్‌కుమార్‌, కనకారావు తదితరులు ఒకరినొకరు పట్టుకుని కర్ర సహాయంతో కలెక్టరేట్‌కు రావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు