logo

స్పందనకు 156 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి సోమవారం 156 అర్జీలు వచ్చాయి.

Published : 29 Nov 2022 04:51 IST

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి సోమవారం 156 అర్జీలు వచ్చాయి. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెన్షన్‌, భూ సమస్యలు వంటి అర్జీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, డీఆర్‌వో కె.చంద్రశేఖర్‌రావు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శివనారాయణశర్మ, ప్రత్యేక ఉప కలెక్టర్‌ లలిత ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు.


నా స్థలంలో మట్టి పోసి ఇబ్బంది పెడుతున్నారు..

దావులూరి జవహర్‌లాల్‌నెహ్రూ

నాది మంగళగిరి మండలం చినవడ్లపూడి. గ్రామంలో 15 సెంట్లు స్థలం ఉంది. ఆ స్థలంలో మట్టికుప్పలు పోసి గ్రామానికి చెందిన కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గ్రామంలో వారే పెత్తనం చేస్తూ స్థలం విషయంలో అడిగితే బెదిరిస్తున్నారు. ఆగష్టులో ఓసారి అర్జీ ఇస్తే ఇటీవల అధికారులు వచ్చి తనను ఫొటో తీసుకెళ్లారు. సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. అందుకని మరోసారి అధికారులకు విన్నవించాలని స్పందనకు వచ్చా. తన స్థలాన్ని వారి చెర నుంచి విడిపించి రక్షణ కల్పించాలి.      


సదుపాయాలు కల్పించాలని వినతి

ఓబులనాయుడుపాలెం శివరాంకాలనీ అభివృద్ధి సంఘం సభ్యులు

గుంటూరు రూరల్‌మండలం ఓబులనాయుడుపాలెంలోని శివరాం కాలనీలో కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందించారు శివరాంకాలనీ అభివృద్ధి సంఘం సభ్యులు. కాలనీలో కనీసం విద్యుత్తు సదుపాయం కూడా లేదని, వీధి దీపాలకు తామే రూ.20 చొప్పున కడుతున్నామన్నారు. తాగునీరు ఎప్పటికప్పుడు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. అధికారులు స్పందించి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వినిపత్రం అందించిన వారిలో ఒ.శివమ్మ, వి.నీరజ, పి.పరిమళ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని