logo

ఈ విహారం.. ఎంతో ప్రమాదకరం

నాగార్జునసాగర్‌ జలాశయంలో చేపలు వేటాడే పడవలను జల విహారానికి వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది.

Published : 29 Nov 2022 04:51 IST

కృష్ణా నదిలో పర్యాటకులతో తిరుగుతున్న చేపల పడవలు  

మాచర్ల, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ జలాశయంలో చేపలు వేటాడే పడవలను జల విహారానికి వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. సాగర్‌ సమీపంలోని అనుపు వద్ద బహిరంగంగానే దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను మత్స్యకారులు తమ పడవుల్లో ఎక్కించుకొంటున్నారు. నదిలో కొంత దూరం మేర విహరించేందుకు మనిషికి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. పడవలో చేపలు నిల్వ చేసే ప్రదేశంలో పిల్లలను కూర్చోబెడుతున్నారు. ఏమాత్రం భద్రత లేని పడవలను వినియోగించడం ఆందోళన కలిగిస్తుంది. తక్షణం అధికారులు మేల్కొని ప్రమాదకర పడవ ప్రయాణానికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని