logo

మాడుగుల ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్‌

ఉపాధ్యాయులు లేరంటూ గురజాల మండలం మాడుగుల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం గురజాలలో చేసిన రాస్తారోకో చేసిన నేపథ్యంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జమ్మిగుంపుల రామారావుపై సస్పెన్షన్‌ వేటు పడింది.

Published : 29 Nov 2022 04:51 IST

ఎంఈవో, డిప్యూటీ డీఈవోలకు షోకాజ్‌

ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు రాస్తారోకో చేయడంతో చర్యలు

గురజాల, న్యూస్‌టుడే : ఉపాధ్యాయులు లేరంటూ గురజాల మండలం మాడుగుల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం గురజాలలో చేసిన రాస్తారోకో చేసిన నేపథ్యంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జమ్మిగుంపుల రామారావుపై సస్పెన్షన్‌ వేటు పడింది. కలెక్టరు శివశంకర్‌ ఆదేశాల మేరకు ఆయనను సస్పెండ్‌ చేసినట్లు డీఈవో వెంకటప్పయ్య తెలిపారు. జిల్లా ట్రెజరీ అధికారికి లిఖిత పూర్వక ఉత్తర్వులు అందజేస్తూ అందులో హెచ్‌ఎంకు ఎలాంటి అలెవెన్స్‌లు అందజేయవద్దన్నారు. సోమవారం ఉదయం ప్రధానోపాధ్యాయుడు రామారావు, గురజాల ఎంఈవో ప్రసాద్‌లను నరసరావుపేటకు పిలిపించారు. మాడుగుల జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘నాడు-నేడు’ పనులు వేగంగా చేయడం లేదని ఇటీవల ఇచ్చిన షోకాజ్‌కు సమాధానం ఇవ్వాలని కోరారు. దీన్ని అడ్డుపెట్టుకొని సస్పెండ్‌ చేసినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా గురజాల ఎంఈవో ప్రసాద్‌, సత్తెనపల్లి డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లుకు షోకాజ్‌లను అందచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని