logo

బాల సాహిత్యం విస్తృతంగా రావాలి

అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్‌ రాసిన బాలల నాటికలన్నీ ‘రెండు చేతులు’ అనే పేరుతో పుస్తక రూపంలోకి రావడం చాలా సంతోషమని ప్రముఖ సినీ రచయిత, అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ బుర్రా సాయిమాధవ్‌ అన్నారు.

Published : 29 Nov 2022 04:51 IST

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సాయిమాధవ్‌, శరత్‌చంద్ర, శివప్రసాద్‌, తదితరులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్‌ రాసిన బాలల నాటికలన్నీ ‘రెండు చేతులు’ అనే పేరుతో పుస్తక రూపంలోకి రావడం చాలా సంతోషమని ప్రముఖ సినీ రచయిత, అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ బుర్రా సాయిమాధవ్‌ అన్నారు. పుస్తక మహోత్సవంలో భాగంగా అరసం ఆధ్వర్యంలో గుంటూరులోని ఏఎల్‌ బీఈడీ కళాశాల ప్రాంగణంలో సోమవారం రాత్రి సభ జరిగింది. సభలో సాయిమాధవ్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో బాలలకు సంబంధించిన నాటికలు రావడం లేదని, బాలల నాటికలకు సంబంధించిన పుస్తకాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షుడు, బాల సాహితీవేత్త దార్ల బుజ్జిబాబు మాట్లాడుతూ సమాజంపై నాటికలు ఎంతో ప్రభావం చూపుతాయన్నారు. సభకు అరసం రాష్ట్ర కార్యదర్శి కొమ్మాలపాటి శరత్‌చంద్ర అధ్యక్షత వహించారు. బుల్లా రవికుమార్‌, గుంటూరు విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ మేనేజర్‌ మురకొండ మల్లికార్జునరావు తదితరులు ప్రసంగించారు.

పుస్తక మహోత్సవంలో నేటి కార్యక్రమాలు: పుస్తక మహోత్సవంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు గోటేటి లలితా శేఖర్‌ కథా సంపుటి ‘పుడమితల్లి నేస్తం’ ఆవిష్కరణ సభ  జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని