logo

నాబార్డు బృందం అధ్యయనం

నాబార్డు కేంద్ర అధ్యయన బృందం మంగళవారం ఈపూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ కార్యాలయాన్ని సందర్శించింది.

Published : 30 Nov 2022 04:40 IST

సంఘం ప్రతినిధుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న అధ్యయన బృందం నాయకుడు నాబార్డు డీజీఎం ప్రశాంత్‌ దూబే

ఈపూరు, న్యూస్‌టుడే : నాబార్డు కేంద్ర అధ్యయన బృందం మంగళవారం ఈపూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ కార్యాలయాన్ని సందర్శించింది. లక్నో కేంద్రంగా నాబార్డు ఆధ్వర్యంలో అధ్యయనం చేసే బర్డ్‌ (బ్యాంకర్స్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌) సంస్థలో దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన 43 మంది సభ్యులు ఉన్నారు. ఈ బృందం మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి సహకార సంస్థల్లో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను, వాటి ద్వారా ప్రజలకు అందుతున్న సేవల గురించి అధ్యయనం చేస్తోంది. ఈపూరులోని సంఘ కార్యాలయాన్ని సందర్శించిన బృందం సభ్యులు ఛైర్‌పర్సన్‌ బొల్లా వెంకటరాధాకృష్ణ, సీఈఓ పోకా కోటేశ్వరరావుతో సమావేశమయ్యారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోలు బంకు, వేబ్రిడ్జి, ఎరువులు, పురుగు మందుల దుకాణం తదితర వ్యాపారాల ద్వారా సమకూరుతున్న ఆదాయం అడిగి తెలుసుకున్నారు. శీతల గిడ్డంగి నిర్మాణానికి నిధులు, రైతుల ఇళ్లకు ఎరువుల సరఫరాకు అవసరమైన వాహనాన్ని సమకూర్చాలని నాబార్డు గుంటూరు డీడీఎం కేఆర్‌డీ కార్తీక్‌ను ఛైర్‌పర్సన్‌ బొల్లా వెంకట రాధాకృష్ణ అడిగారు. కార్యక్రమంలో అధ్యయన బృంద నాయకుడు ప్రశాంత్‌ దూబే, నాబార్డు డీజీఎంలు అనుకంప ఝా, నాబార్డు కృష్ణా   జిల్లా డీడీఎం మిలిండ్‌, డీసీసీబీ గుంటూరు జీఎం భాను, డీజీఎం ఫణి అంగలూరు సొసైటీ సీఈఓ కోటేశ్వరరావు పాల్గొన్నారు.  

శావల్యాపురం : సొసైటీ బ్యాంకుల ద్వారా రైతులకు అందిస్తున్న వివిధ రకాల సేవల గురించి తెలుసుకోవడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని కో ఆపరేటివ్‌ బ్యాంకు, స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి బ్యాంకర్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంటు లక్నో వారి ఆధ్వర్యంలో విజయవాడలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని ఉమ్మడి గుంటూరు జిల్లా జీఎం శేషుభానురావ్‌ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా బృంద సభ్యులు మంగళవారం శావల్యాపురంలోని సొసైటీ కార్యాలయం, వేల్పూరులో నిర్మాణంలో ఉన్న కోల్డ్‌ స్టోరేజీ పనులను పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని