logo

పోతేపోని ప్రజల డబ్బేగా..

జంపని రామారావు తెనాలి మున్సిపాలిటీలో శానిటరీ మేస్త్రీగా పనిచేసి 2018లో ఉద్యోగ విరమణ  చేశారు.

Updated : 02 Dec 2022 07:56 IST

పదవీ విరమణ చేసిన ఉద్యోగికి అప్పనంగా చెల్లింపు
ఈనాడు-అమరావతి

జంపని రామారావు తెనాలి మున్సిపాలిటీలో శానిటరీ మేస్త్రీగా పనిచేసి 2018లో ఉద్యోగ విరమణ  చేశారు. ఆయనకు అధికారులు ప్రతి నెలా రూ.లక్షల్లో జీతం చెల్లిస్తున్నారు.నాలుగేళ్లుగా కొనసాగుతున్న నిర్వాకాన్ని  తాజాగా ఖజానా అధికారులు వెలికితీశారు. తప్పిదానికి చింతించాల్సిన యంత్రాంగం ఈ నెలకు(నవంబరు) జీతం బిల్లు పాస్‌ చేయమని చెప్పడం శోచనీయం. జీతాల బిల్లులు చేసే డీడీఓ విధి నిర్వహణలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ ఉదంతం చాటుతోంది. అక్కడ పనిచేసే మరో రెవెన్యూ అధికారి మున్సిపల్‌ షాపులు వేలం వేసి దానికి సంబంధించిన రుసుములను జమచేయకుండా తప్పించుకు తిరుగుతున్నారు. సెలవులో ఉన్న ఉద్యోగికి ప్రతి నెలా జీతం దోచిపెడుతూ ప్రభుత్వం నష్టపోయేలా వ్యవహరిస్తున్నారు.  తెనాలి పురపాలక సంఘంలో శానిటరీ మేస్త్రీగా పనిచేస్తున్న జంపని రామారావు 7.7.1958లో పుట్టినట్లు 21.12.1976లో ఉద్యోగంలో చేరినట్లు సర్వీసు రికార్డులో ఉంది. ఆయనకు 14 ఏళ్లకు ఉద్యోగం వచ్చినట్లు స్పష్టమవుతోంది.

బయటపడిందిలా..

ఈఏడాది నవంబరు 30 నాటికి 25 ఏళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగుల వివరాలను జీతాల బిల్లులతో సహా పంపాలని ఇటీవల ప్రభుత్వం ట్రెజరీ అధికారులను ఆదేశించింది. దీంతో తెనాలి పురపాలక పంపిన ఆ బిల్లులను పరిశీలించేటప్పుడు బయటపడింది. అనుమానించిన ఖజానావర్గాలు అతని సర్వీసు రికార్డులు తీసుకుని పరిశీలన చేయగా అందులో కొట్టివేతలు కనిపించాయి. ఆయన పుట్టిన తేదీ జనన-మరణ విభాగం రిజిస్టర్‌లో ఒకలా, స్కూల్‌ రికార్డుల్లో(5.2.1962) మరోలా ఉండటమే రికార్డుల్లో చాలా ఆలస్యంగా నమోదు చేయటం చూసి అధికారులను ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా రికార్డుల్లో నమోదు చేశారని భావిస్తున్నామని, డీడీఓను వివరణ కోరామని తెనాలి సహాయ ఖజానా అధికారి శ్రీరామచంద్రమూర్తి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు