logo

మోగనున్న పెళ్లి బాజా

ఉమ్మడి జిల్లాకు పెళ్లి కళ వచ్చేసింది. మూడు నెలల తరువాత సందడి నెలకొంది. వేసవి తరువాత పెళ్లిళ్లకు అనుకూలమైన వాతావరణం డిసెంబరులో ఉండటంతో ఈ మాసంలో అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి.

Published : 02 Dec 2022 06:25 IST

మూడు నెలల తరువాత సందడి
న్యూస్‌టుడే-గుంటూరు

మ్మడి జిల్లాకు పెళ్లి కళ వచ్చేసింది. మూడు నెలల తరువాత సందడి నెలకొంది. వేసవి తరువాత పెళ్లిళ్లకు అనుకూలమైన వాతావరణం డిసెంబరులో ఉండటంతో ఈ మాసంలో అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి.గుంటూరు,  తెనాలి, నరసరావుపేట, చిలకలూరిపేట,  బాపట్ల పట్టణాల్లో కల్యాణ మండపాలు పెళ్లిళ్లకు రిజర్వ్‌ అయ్యాయి.  

గత ఆగస్టు నెలాఖరు నుంచి నవంబరు వరకు పెళ్లి ముహూర్తాలు లేవు. ఈ నెలలో రెండు నుంచి 21వ తేదీ వరకు లగ్నాలు ఉన్నాయి. 3, 4, 7, 8, 16, 17, 18 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో వేల సంఖ్యలో వివాహాలు జరుగుతాయని ప్రముఖ పురోహితుడు పులుపుల ఫణికుమార్‌శర్మ తెలిపారు. ఈ నెల 21 తరువాత వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ వరకు ముహూర్తాలకు వేచి చూడాల్సిందే. వచ్చే నెలలో 22, 26, 27, 28 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయి. శుభకార్యాల సందడితో 20 నుంచి 25 రంగాల వారికి ఉపాధి లభించనుంది. చేతి నిండా పని దొరుకుతుందని పెళ్లిళ్లపై ఆధారపడి జీవనం సాగించే వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు