logo

‘సీఎం నిర్ణయంతో భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం’

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొన్న మూడు రాజధానుల నిర్ణయంతో ప్రపంచ స్థాయి రాజధాని నగరం నిర్మించాల్సిన ప్రాంతం నేడు ముళ్ల చెట్లతో అడవిని తలపిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 02 Dec 2022 06:25 IST

తాడికొండ శిబిరంలో నినాదాలు చేస్తున్న రైతులు, మహిళలు

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొన్న మూడు రాజధానుల నిర్ణయంతో ప్రపంచ స్థాయి రాజధాని నగరం నిర్మించాల్సిన ప్రాంతం నేడు ముళ్ల చెట్లతో అడవిని తలపిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో సత్వరమే ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విధానాలతో భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి అన్యాయాలను ఎలుగెత్తి చాటుతున్న మీడియాపై ముఖ్యమంత్రి అక్కస్సు వెళ్లగక్కడం దారుణమన్నారు. ప్రజలు వైకాపా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు 1080వ రోజుకు చేరాయి. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి, ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అంటూ గురువారం తాడికొండ శిబిరంలో మహిళలు నినాదాలు చేశారు. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, నీరుకొండ, కృష్ణాయపాలెం, తుళ్లూరు, నెక్కల్లు, దొండపాడు తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని