logo

‘అరాచక పాలనతో తెలుగు తల్లి కన్నీరు’

సీఎం జగన్‌ అవినీతి, అరాచకపు పాలనకు తెలుగు తల్లి కన్నీరు పెడుతుందని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 02 Dec 2022 06:25 IST

పోస్టర్లు, స్టిక్కర్లు ఆవిష్కరిస్తున్న సాయికృష్ణ, జయలక్ష్మి

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: సీఎం జగన్‌ అవినీతి, అరాచకపు పాలనకు తెలుగు తల్లి కన్నీరు పెడుతుందని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ గార్డెన్స్‌లోని వెంకటేశ్వరస్వామి దేవాలయం ఎదురుగా అన్నమయ్య పార్కులో ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లను తెదేపా నాయకులతో కలసి గురువారం ఆవిష్కరించారు. సాయికృష్ణ మాట్లాడుతూ ‘ఒక్క అవకాశం అని ప్రజల్ని బతిమాలుకుని ముద్దులు పెట్టి, తలలు నిమిరి అధికారంలోకి వచ్చిన జగన్‌ మూడున్నరేళ్లలో జనం నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తాను. పరిశ్రమలు వస్తాయి. నిరుద్యోగులందరికీ ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని ఊదరగొట్టిన జగన్‌ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. కేసుల మాఫీ కోసం కేంద్రంలోని పెద్దల ముందు మోకరిల్లుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో పయనిస్తుంది. 92612 92612 ఫోన్‌ నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి మద్దతు తెలిపి సమస్యలను విన్నవించుకోవాలి’.. అని కోరారు. జయలక్ష్మి మాట్లాడుతూ ‘జగన్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనుకుంటున్నారు. పింఛను రూ.3,000 చేస్తామని చేయలేదు. మద్య నిషేధం అమలు చేస్తామని చేయలేదు. ఆర్టీసీ, విద్యుత్తు ఛార్జీలు విపరీతంగా పెంచారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన జగన్‌ను ఇంటికి సాగనంపాలి’.. అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు షేక్‌ ఫిరోజ్‌, షేక్‌ నాగుల్‌మీరా, కిరణ్‌ యాదవ్‌, శివకుమార్‌, తెలుగు మహిళ నాయకురాళ్లు షేక్‌ రిజ్వానా, నవమి, మీనాక్షి, శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని