logo

బర్మింగ్‌హామ్‌ వర్సిటీతో వీఐటీ ఏపీ ఒప్పందం

బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం, వీఐటీ-ఏపీ వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లా మధ్య గురువారం అవగాహన ఒప్పందం జరిగింది.

Published : 02 Dec 2022 06:25 IST

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం, వీఐటీ-ఏపీ వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లా మధ్య గురువారం అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వి.ఐ.టి-ఏపీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డా.ఎస్‌.వి.కోటారెడ్డి మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా స్కూల్‌ ఆఫ్‌ లా విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. దీని ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో న్యాయ నిపుణులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. అంతర్జాతీయ చట్టం, మానవ హక్కులు, వ్యాపారం, వాణిజ్య చట్టాలు, మేధో సంపత్తి చట్టాలు, నూతన ఎమర్జింగ్‌ టెక్నాలజీ చట్టం తదితరాలను ప్రోత్సహించడానికి త్వరలోనే వర్సిటీ ఆధ్వర్యంలో ఎక్సలెన్స్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు చట్టపరమైన సాధికారతను అందించడానికి అవి పనిచేస్తాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా తమ యూనివర్సిటీ విద్యార్థులు బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయంలో ఒక సెమిస్టర్‌ లేదా ఒక సంవత్సరం విద్యనభ్యసించే అవకాశం ఉంటుందన్నారు. న్యాయ రంగంలో జ్ఞాన భాగస్వామ్యం, అతిధి ఉపన్యాసాలు, వర్క్‌షాపులు, సింపోజియంలు, అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించడానికి ఈ ఒప్పందం అవకాశాన్ని కలిగిస్తుందన్నారు. బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం గ్లోబల్‌ ఎంగేజ్‌మెంట్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ పాల్‌ మెక్‌కానెల్‌ మాట్లాడుతూ ఈ విద్యాపరమైన పరిశోధనలు, సామర్థ్యాల పెంపుదల, అకడమిక్‌లను ప్రోత్సహించడానికి రెండు యూనివర్సిటీల మధ్య అవగాహన ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపారు. వర్సిటీతో భవిష్యత్తులో మరిన్ని అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వి.ఐ.టి -ఏపీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డా.జగదీశ్‌ చంద్ర ముదిగంటి, లా స్కూల్‌ డీన్‌ డా.బెనర్జీ చక్కా, విద్యార్థులు, అధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు