logo

CPS: సీపీఎస్‌పై చర్చ.. 20 ఉద్యోగ సంఘాలకు ఏపీ ఆర్థికశాఖ ఆహ్వానం

ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్) అంశంపై చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. రేపు సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ చర్చలు జరపనున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.

Updated : 05 Dec 2022 20:17 IST

అమరావతి: ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్) అంశంపై చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. రేపు సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ చర్చలు జరపనున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 20 ఉద్యోగ సంఘాల నేతలకు, ప్రతినిధులకు ఆర్థిక శాఖ సమాచారం పంపించింది. ప్రధాన ఉద్యోగ సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్లనూ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. సీపీఎస్‌పై ఏర్పాటైన మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది. అయితే, సీపీఎస్ అంశంపై చర్చించేందుకు మాత్రమే రావాలని ఆర్థిక శాఖ ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని