logo

రేషన్‌ దుకాణంలో విజిలెన్స్‌ అధికారుల దాడులు

గుంటూరు ప్రాంతీయ నిఘా, అమూల్‌ అధికారి ఎస్‌.వి.మాధవరెడ్డి ఆదేశాలపై సంతమాగులూరు మండలం కొప్పరంలోని రేషన్‌ దుకాణాలపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యూనిట్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.

Published : 07 Dec 2022 04:21 IST

కొప్పరంలో తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

కొప్పరం (సంతమాగులూరు): గుంటూరు ప్రాంతీయ నిఘా, అమూల్‌ అధికారి ఎస్‌.వి.మాధవరెడ్డి ఆదేశాలపై సంతమాగులూరు మండలం కొప్పరంలోని రేషన్‌ దుకాణాలపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యూనిట్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. గుంజి నాగలక్ష్మి, గోపాలకృష్ణ నిర్వహిస్తున్న దుకాణంలో 4.265 టన్నుల ప్రజా పంపిణీ బియ్యం నిల్వల్లో వ్యత్యాసం ఉండటం, కార్డుదారుల నుంచి బియ్యం సేకరించి నల్లబజారుకు తరలిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. వీరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసేందుకు పోలీసులకు సిఫారసు చేసినట్లు విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మారెడ్డి తెలిపారు. మరో దుకాణదారుడు సాధుపాటి రామారావు 7.10 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం నిల్వల్లో వ్యత్యాసం ఉండటంతో అతనిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ తహసీల్దారు ఎ.నాగమల్లేశ్వరరావు, సీఎస్‌ బీటీ.శరత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని