logo

గంటసేపు ఆపారు!

కడప జిల్లాలో కార్యక్రమాలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్తారని ట్రాఫిక్‌ను కుంచనపల్లి సమీపంలో ఆపారు.

Published : 07 Dec 2022 04:21 IST


ట్రాఫిక్‌ కారణంగా వాహనం దిగి కార్యాలయానికి నడిచి వస్తున్న అచ్చెన్నాయుడు

ఈనాడు, అమరావతి: కడప జిల్లాలో కార్యక్రమాలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్తారని ట్రాఫిక్‌ను కుంచనపల్లి సమీపంలో ఆపారు. కానీ జాతీయ రహదారిని ఖాళీగా ఉంచి లారీలు, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనచోదకులను సైతం మంగళగిరి నుంచి ఆత్మకూరు వరకూ తెదేపా జాతీయ కార్యాలయం వైపు సర్వీసు రోడ్డులో గంటకు పైగా నిలిపేశారు. జగన్మోహన్‌రెడ్డి పాలనలో బీసీలపై జరిగిన దాడులు, దౌర్జన్యాలపై ఫొటో ఎగ్జిబిషన్‌, విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారని, అందుకే ఈ దారిలో వారి వాహనాలు రానివ్వకుండా ఇలా నిలిపేశారని తెదేపా జాతీయ పార్టీ కార్యాలయంలో బీసీ నేతలు ఆరోపించారు.తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుపోగా కిలోమీటరు దూరం ఆయన నడిచి వచ్చారు. ఎందుకు ఆపారో, ఎంతసేపు పడుతుందో తెలియక వాహనచోదకులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాతావరణం అనుకూలించక సీఎం కడపకు వెళ్లే కార్యక్రమం చివరకు రద్దు కావడం కొసమెరుపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని