logo

Alapati Raja: తెనాలి సీటు నాకేమీ రాసి పెట్టి లేదు: మాజీ మంత్రి ఆలపాటి రాజా

‘జనసేనతో పొత్తు ఉండేది, లేనిదీ అధిష్టానం చూసుకుంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది అధిష్టానం నిర్ణయిస్తుంది’.. అని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు.

Updated : 23 Dec 2022 07:35 IST

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: ‘జనసేనతో పొత్తు ఉండేది, లేనిదీ అధిష్టానం చూసుకుంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది అధిష్టానం నిర్ణయిస్తుంది’.. అని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘నేను తెలుగు యువత నాయకుడిగా 1989 నుంచి 1994 వరకు నేనే పని చేసిన విధానం అందరికీ తెలుసు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించా. 33 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నా. కేవలం అధికారం కోసం ఆలపాటి రాజా తెదేపాలో లేడు. తెనాలి సీటు నాకు ఏమీ రాసి పెట్టి లేదు. మొదట్లో వేమూరులో, ఆ తర్వాత తెనాలిలో పోటీ చేశాను. ఒక సీటు అని రాసి పెట్టలేదు. నన్ను మానసికంగా సిద్ధం చేయాల్సిన అవసరం లేదు. నేను మానసికంగా ఎప్పుడూ బలంగా ఉంటాను. ఏ పదవి వచ్చినా స్వీకరించా. ఎమ్మెల్యే అయ్యాను. మంత్రి అయ్యాను. నా గురించి ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు. నేను ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ విషయం చంద్రబాబు చూసుకుంటారు’..అని ఆలపాటి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని