నవోదయ 9వ తరగతి ప్రవేశ పరీక్షకు హాల్‌టికెట్ల విడుదల
మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయలో 2023- 24 విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 700 మంది అభ్యర్థులకు ఫిబ్రవరి 11న నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు హాల్‌టికెట్లు విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు సోమవారం తెలిపారు.
చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయలో 2023- 24 విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 700 మంది అభ్యర్థులకు ఫిబ్రవరి 11న నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు హాల్‌టికెట్లు విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు సోమవారం తెలిపారు. ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్ హెచ్‌టీటీపీఎస్:11న నవోదయ.జీవోఇ.ఇన్‌లో తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా పుట్టిన తేదీ, అభ్యర్థి పూర్తి వివరాలు నమోదు చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలని కోరారు. లేకుంటే మద్దిరాలలోని నవోదయలో సంప్రదించాలని కోరారు.
* 2023- 24 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి సంబంధించి అభ్యర్థులు ఈనెల 31 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. చివరి సమయంలో సర్వస్ బిజీ అవుతున్న నేపథ్యంలో త్వరగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈమేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 17 నియోజకవర్గాల్లో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2022- 23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!