ముఖ ఆధారిత హాజరుకు కాసులు..!
పనివేళల్లో ఉద్యోగులు విధిగా విధుల్లో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముఖ ఆధారిత హాజరును ప్రవేశపెడితే దాన్ని వైద్య-ఆరోగ్యశాఖలో కొందరు డీడీఓలు వ్యక్తిగతంగా సొమ్ము చేసుకుంటున్నారు.
వైద్య, ఆరోగ్య శాఖలో వసూళ్ల పర్వం
ఈనాడు-అమరావతి
పనివేళల్లో ఉద్యోగులు విధిగా విధుల్లో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముఖ ఆధారిత హాజరును ప్రవేశపెడితే దాన్ని వైద్య-ఆరోగ్యశాఖలో కొందరు డీడీఓలు వ్యక్తిగతంగా సొమ్ము చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో(ఫీల్డ్) పనిచేసే ఏఎన్నెమ్, ఆశా, హెల్త్ ఎడ్యుకేటర్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర ఉద్యోగులు వారు పనిచేసే పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో నుంచి హాజరు ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో నమోదు చేసుకుంటే అది డీడీఓ లాగిన్లోకి వెళుతుంది. దాన్ని సంబంధిత డీడీఓ అధికారి ధ్రువీకరిస్తేనే అతనికి హాజరు పడుతుంది. ఒకవేళ ధ్రువీకరించకుంటే అందుకు కారణాలు తెలియజేయాలి. ఎవరైనా ఉద్యోగి పని ప్రదేశం నుంచి కాకుండా ఇంటి వద్ద నుంచో లేక మరేదైన ప్రాంతం నుంచి హాజరు వేసుకుంటే ఎక్కడి నుంచి వేసుకున్నది అది డీడీఓకు తెలుస్తుంది. దీన్ని బూచిగా చూపి ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా ఇప్పటికే కొందరు డీడీఓలు వసూళ్లకు తెరలేపారు. గుంటూరు జిల్లాలో ఓ పీహెచ్సీ డీడీఓ తన పరిధిలో పనిచేసే ఉద్యోగులకు పని ప్రదేశం నుంచి హాజరు వేసుకోకపోయినా అప్రూవల్ ఇచ్చి ఆమేరకు జీతానికి సిఫార్సు చేస్తానని చెప్పి బాహాటంగానే వసూళ్లకు శ్రీకారం చుట్టారు. నెలకు ఎన్నిరోజులైతే ఆలస్యంగా వస్తున్నారో అన్ని రోజులకు నెలవారీ మాముళ్లు గుంజుతున్నట్లు సమాచారం. ఒక్క హాజరుకే కాదు ఎవరైనా సెలవులు పెడితే ఎందుకు అనవసరంగా లీవ్‌లెటర్ ఇస్తారు హాజరు నమోదు చేసుకోమని సూచిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆ డీడీఓకు నలుగురైదుగురు ఉద్యోగుల నుంచి నెలకు కనీసం అంటే రూ.20 వేల దాకా ముడుతున్నాయని చెబుతున్నారు. జిల్లాల విభజన జరిగినా ఇప్పటికీ పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని పలు ఆస్పత్రుల్లో పనిచేసే పారామెడికల్ ఉద్యోగులు గుంటూరు నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చినప్పుడు జీతాలకు యాప్‌ను అనుసంధానిస్తామని, ఎన్ని రోజులు గైర్హాజరయ్యారో చూసి జీతాలు చెల్లింపులు చేస్తామని చెప్పినా ఇప్పటి దాకా అనుసంధానం చేయలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
మైనర్లను పెళ్లాడిన వారికి కటకటాలే.. వేలమంది భర్తలకు శిక్ష తప్పదు: అస్సాం సీఎం హెచ్చరిక
-
Politics News
Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత
-
India News
Mughal Garden: మొగల్ గార్డెన్స్ ఇక.. ‘అమృత్ ఉద్యాన్’
-
Crime News
Crime News: ఆంధ్రప్రదేశ్ పోలీసులమంటూ దోపిడీలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29/01/2023)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ