logo

అరుపులు.. కేకలు..

ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పడానికి ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యేకు, ఆయన వ్యతిరేక వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో గురువారం జరిగింది.

Published : 27 Jan 2023 04:47 IST

ఫ్లెక్సీల ఏర్పాటులో ఎమ్మెల్యే, వ్యతిరేక వర్గీయుల వాద ప్రతివాదనలు

పొన్నూరులో వైకాపా నేతలతో చర్చిస్తున్న పోలీసులు

పొన్నూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పడానికి ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యేకు, ఆయన వ్యతిరేక వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో గురువారం జరిగింది. పొన్నూరులో పురపాలకసంఘం మాజీ ఛైర్‌పర్సన్‌ నల్లమోతు రూత్‌రాణి కుమారుడు శుక్రవారం జరిగే వివాహానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజకానున్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పట్టణానికి రానున్న నేపథ్యంలో వైకాపా నేతలు ఘనంగా స్వాగతం పలకడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ క్రమంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య వర్గీయుల మధ్య, ఆయన వ్యతిరేక వర్గీయుల మధ్య వాద ప్రతివాదనలు చోటు చేసుకున్నాయి. ఇరువర్గాల నేతలు మాటలు తూటాలు పేలాయి.దీంతో ఆప్రాంతం మంతా అరుపులు కేకలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో స్పందించిన అర్బన్‌ సీఐ బాబీ, గ్రామీణ సీఐ ప్రభాకరరావు ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఆ కళ్యాణ మండపం ప్రధాన ద్వారం ఎదుట పురపాలక సంఘం మాజీ ఛైర్‌పర్సన్‌ నల్లమోతు రూత్‌రాణికి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు ఇరువర్గాలు ఆమోదించడంతో వివాదం సద్దుమణిగింది. నాయకులు ఇంత హడావుడి చేసినా చివరకు ముఖ్యమంత్రి పర్యటన రద్దయినట్లు సాయంత్రానికి అధికారులకు సమాచారం రావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని