logo

ఏలూరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్‌

తెదేపా బాపట్ల పార్లమెంటు అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గురువారం తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Published : 27 Jan 2023 04:47 IST

మార్టూరు, చినగంజాం, న్యూస్‌టుడే: తెదేపా బాపట్ల పార్లమెంటు అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గురువారం తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈక్రమంలో యువగళం పాదయాత్ర చేపట్టేందుకు వచ్చిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. లోకేశ్‌ ఏలూరిని ఆలింగనం చేసుకొని శాలువా కప్పి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు దామిచర్ల జనార్దన్‌, కందుల నారాయణరెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, పోతుల రామారావు, కరుగొండ్ల రామకృష్ణ, ముత్తుమాల అశోక్‌రెడ్డి, తెదేపా నియోజకవర్గ బాధ్యులు ఇంటూరి నాగేశ్వరావు, ఎరిక్షన్‌ బాబు, దామచర్ల సత్య, బీసీ జనార్దన్‌రెడ్డి ఉన్నారు.
బాపట్ల: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారని తెదేపా బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ అన్నారు. తిరుమలలో లోకేశ్‌తో కలిసి ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్నారు. యువనేతకు వేగేశన సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ప్రజలకు యువగళం ద్వారా లోకేశ్‌ గొప్ప భరోసా ఇస్తారన్నారు. నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు యువగళం పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలుపుతామన్నారు. వైకాపా ప్రభుత్వ అరాచక పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన సీఎం జగన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున కొత్త పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి   కల్పిస్తారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని