logo

రాజ్యాంగ విలువల పెంపుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

రాజ్యాంగ నిబంధనలకు లోబడి వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేసినపుడే రాజ్యాంగం అమలు తీరు బాగుంటుందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ఏపీ పోలీస్‌ ఫిర్యాదుల కమిటీ రాష్ట్ర సభ్యురాలు ఉదయలక్ష్మి తెలిపారు.

Published : 27 Jan 2023 04:47 IST

మాట్లాడుతున్న ఏపీ పోలీస్‌ ఫిర్యాదుల కమిటీ రాష్ట్ర సభ్యురాలు ఉదయలక్ష్మి

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే:  రాజ్యాంగ నిబంధనలకు లోబడి వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేసినపుడే రాజ్యాంగం అమలు తీరు బాగుంటుందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ఏపీ పోలీస్‌ ఫిర్యాదుల కమిటీ రాష్ట్ర సభ్యురాలు ఉదయలక్ష్మి తెలిపారు. నగరంలోని ఆంధ్రా న్యాయ కళాశాల సమావేశ మందిరంలో దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్‌ గెడ్డం ఝాన్సీ అధ్యక్షతన ‘రాజ్యాంగ విలువల పెంపు- ప్రజాస్వామ్యం పరిరక్షణ’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉదయలక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగ విలువల పెంపుతోనే ప్రజాస్వామ్యం పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ఆయా వ్యవస్థలు పరిధులు అతిక్రమిస్తే సరి చేయడానికి న్యాయ వ్యవస్థ ఉందన్నారు. శాసనమండలి ప్రభుత్వ విప్‌ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు బాధ్యతతో వ్యవహరించడం ద్వారా రాజ్యాంగ విలువలను పెంచాలన్నారు. ప్రజాస్వామ్య విలువలతో కూడిన సమాజం ఏర్పాటుకు అందరూ కృషి చేయాలన్నారు. సెంట్రల్‌ జీఎస్‌టీ, కస్టమ్స్‌ అధికారి రాజేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో మహిళల అభివృద్ధికి కృషి చేసిన వారిలో అంబేడ్కర్‌ మొదటి వారన్నారు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి రామ్‌గోపాల్‌ మాట్లాడుతూ రాజ్యాంగం, రాజ్యాంగ విలువల గురించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. దేశంలో మహిళలపై చిన్న చూపు, అసమానతలు, కుల వైషమ్యాలు, అనేక రుగ్మతలు ఉన్నాయని, వీటిని రూపుమాపాలంటే రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాలని తెలిపారు. న్యాయ విభాగం ఆచార్యులు ఎ.సుబ్రహ్మణ్యం, హైకోర్టు న్యాయవాది డాక్టర్‌ సయ్యద్‌బాబు, కేఎల్‌యూ ఆచార్యులు డాక్టర్‌ ఫర్హద్‌, ఏఎన్‌యూ ఆచార్యులు డాక్టర్‌ శ్రీగౌరి, స్నేహ గ్రూప్‌ ప్రతినిధి రజనీకాంత్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని