logo

అహింస, సమైక్యతకు స్ఫూర్తి ‘దండి మార్చ్‌’

అహింస, దేశ సమైక్యత స్ఫూర్తి ‘దండి మార్చ్‌’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గుంటూరు ఆటోనగర్‌లోని వైజంక్షన్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన దండి మార్చ్‌ సముదాయ విగ్రహాలను గురువారం మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు.

Published : 27 Jan 2023 04:47 IST

విగ్రహాలను ఆవిష్కరించిన నాయకులు, అధికారులు

పెదకాకాని, న్యూస్‌టుడే : అహింస, దేశ సమైక్యత స్ఫూర్తి ‘దండి మార్చ్‌’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గుంటూరు ఆటోనగర్‌లోని వైజంక్షన్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన దండి మార్చ్‌ సముదాయ విగ్రహాలను గురువారం మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ విగ్రహాలు ఉద్యమ ప్రభావాన్ని చూపడంతో పాటు స్వాతంత్య్ర సమర యోధుల పోరాట పటిమకు నిదర్శనంగా ఉన్నాయన్నారు. స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాలు మరిన్ని ఏర్పాటు చేసి నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, కమిషనర్‌ కీర్తి చేకూరి, కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, రోశయ్య, మద్దాళిగిధర్‌, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మణరావు, మిర్చియార్డు ఛైర్మన్‌ యేసురత్నం, డిప్యూటీ మేయర్లు సజీలా, వజ్రబాబు, వైకాపా నేతలు డొక్కా మాణ్యిక్యవరప్రసాద్‌, నూరి ఫాతిమా, కార్పొరేటర్లు, రంగారెడ్డి, రిహానాఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని