logo

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

Published : 27 Jan 2023 04:47 IST

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే:  74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. దేశ భక్తి గీతాలకు విద్యార్థులు వివిధ వేషధారణలో చేసిన నృత్యాలను అందరినీ కట్టిపడేశాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో సెయింట్‌ జోసఫ్‌ హైస్కూల్‌, ఆపిల్‌ ఆంగ్ల మాధ్యమం స్కూల్‌ పేరేచర్ల, సెయింట్‌ ఇగ్నిషియస్‌ స్కూల్‌, శ్రీవెంకటేశ్వర బాలకుటీర్‌, టాప్‌ కిడ్స్‌ స్కూల్‌, సెయింట్‌ లారెల్స్‌ ఆంగ్ల మాధ్యమం స్కూల్‌, కేఎల్‌పీ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. ఇందులో శ్రీవెంకటేశ్వర బాలకుటీర్‌, సెయింట్‌ ఇగ్నిషియస్‌ స్కూల్‌, సెయింట్‌ లారెల్స్‌ ఆంగ్ల మాధ్యమం స్కూల్‌, ఆపిల్‌ ఆంగ్ల మాధ్యమం స్కూల్‌ పేరేచర్ల విద్యార్థులు ప్రతిభ చాటి వరుస స్థానాల్లో నిలిచారు. వీరికి కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందించారు.


శకటాల ప్రదర్శన

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని శకటాల ప్రదర్శన నిర్వహించారు. మొత్తం 17 శాఖల ఆధ్వర్యంలో శకటాలను ఆయా శాఖల్లో అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసేలా రూపొందించారు. ఇందులో ప్రథమ స్థానంలో జిల్లాపరిషత్తు-డీపీఆర్‌సీ, వ్యవసాయ శాఖ- ఉద్యాన శాఖ-ఏపీఎంఐపీ ద్వితీయ స్థానం, రవాణా శాఖ, జాతీయ ఓటర్ల దినోత్సవ శకటం నాలుగో స్థానంలో నిలిచాయి. ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి చేతుల మీదుగా జ్ఞాపికలను అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని