logo

అసమ్మతి గళంపై పోలీసుల నిఘా

సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో అధికార పార్టీ వైకాపా అసంతృప్తివాదులపై పోలీస్‌ నిఘా పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టినా, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి ఫోన్‌లో హెచ్చరికలు వెళ్తున్నాయి.

Published : 29 Jan 2023 05:59 IST

వినుకొండ, న్యూస్‌టుడే : సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో అధికార పార్టీ వైకాపా అసంతృప్తివాదులపై పోలీస్‌ నిఘా పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టినా, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి ఫోన్‌లో హెచ్చరికలు వెళ్తున్నాయి. వినుకొండ మండలానికి చెందిన దావులూరి సీఎంకు స్వాగతం పలుకుతూ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు లేకుండా ఇతర నేతల చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా శుక్రవారం రాత్రి వెంటనే మున్సిపల్‌ సిబ్బంది వాటిని తొలగించారు. పోలీసులు రంగంలోకి దిగి ఫ్లెక్సీ ప్రింటింగ్‌ మిషన్‌ యజమానిని, తర్వాత దావులూరిని స్టేషన్‌కు తీసుకెళ్లి హెచ్చరించి వదిలేశారు. ఫ్లెక్సీలను సామాజిక మాధ]్యమాల్లో ట్రోల్‌ చేశారని వైకాపాకు చెందిన వినుకొండ సొసైటీ మాజీ అధ్యక్షుడు చింతా ఆదిరెడ్డి, నాగిరెడ్డి వెంకటరెడ్డి, బొల్లాపల్లికి చెందిన కోటానాయక్‌ను పోలీస్‌ అధికారి ఒకరు ఫోన్‌లో హెచ్చరించారు. అసమ్మతి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దని చెప్పారని తెలిసింది. ఆయా సంఘటనలను పరిశీలిస్తే ఎమ్మెల్యే అసమ్మతి వర్గీయులపై ప్రత్యేక నిఘా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని