logo

Andhra News: అర్ధరాత్రి మహిళా డిప్యూటీ కలెక్టర్‌ గది తలుపు కొట్టిన డిప్యూటీ తహసీల్దార్‌

శిక్షణ తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్‌పై మంగళగిరి గ్రామీణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...

Updated : 31 Jan 2023 10:07 IST

కాజ (మంగళగిరి), న్యూస్‌టుడే: శిక్షణ తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్‌పై మంగళగిరి గ్రామీణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... అనంతపురానికి చెందిన సతీష్‌ గుంటూరు జిల్లా మంగళగిరి పరిధి కాజ సమీపంలోని ఏపీ హెచ్‌ఆర్‌డీఐ శిక్షణ కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్‌గా శిక్షణ తీసుకుంటున్నారు. అదే కేంద్రంలో మహిళా డిప్యూటీ కలెక్టర్‌ కూడా శిక్షణ కోసం వచ్చారు. తెల్లవారుజామున 2గంటల సమయంలో సతీష్‌ కేంద్రం వసతిగృహమైన వీకేఎన్‌కే అపార్ట్‌మెంట్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఉండే గది తలుపులు కొట్టడంతో ఆమె 112కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మంగళగిరి గ్రామీణ ఎస్సై రమేష్‌బాబు తమ సిబ్బందితో ఘటనా ప్రదేశానికి చేరుకుని సదరు డిప్యూటీ తహసీల్దార్‌ని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. మహిళా డిప్యూటీ కలెక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఎస్సై రమేష్‌బాబు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని