logo

సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్‌ పరీక్షలు

ఉమ్మడి గుంటూరు జిల్లా యూనిట్‌గా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ప్రయోగ.. థియరి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ అధికారిణి(ఆర్‌ఐవో) జి.సునీత పేర్కొన్నారు.

Updated : 02 Feb 2023 05:15 IST

ఉమ్మడి జిల్లా యూనిట్‌గా నిర్వహణ

‘న్యూస్‌టుడే’తో ఆర్‌ఐవో సునీత

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లా యూనిట్‌గా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ప్రయోగ.. థియరి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ అధికారిణి(ఆర్‌ఐవో) జి.సునీత పేర్కొన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 15న ఎథిక్స్‌, హ్యూమన్‌ వాల్యూస్‌ పాఠ్యాంశాలతో పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. 17న ఎన్విరాన్‌మెంటల్‌ పాఠ్యాంశంపై పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 7 వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించి ఆ వెంటనే థియరి(పబ్లిక్‌) పరీక్షలపై దృష్టిసారిస్తామన్నారు. గతంలో 20 రోజులపాటు ప్రయోగ పరీక్షలు నిర్వహించగా, ఈసారి 10 రోజుల్లో పరీక్షలు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఒక్కో కేంద్రంలో రెండు ల్యాబ్‌లను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. మౌలిక వసతులున్న కళాశాలలనే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రయోగ.. థియరి పరీక్షలు జరిగే అన్ని కళాశాలల్లో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తున్ననట్లు ఆర్‌ఐవో చెప్పారు. నిఘా నీడలోనే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఒప్పంద కాలాన్ని ప్రభుత్వం తాజాగా పొడిగించిందన్నారు. దీంతో పల్నాడు జిల్లాలో 55 మంది, గుంటూరులో 17 మంది సేవలు కొనసాగుతాయన్నారు. ఇంటర్‌ పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణత నమోదయ్యేలా పునశ్చరణ, నమునా పరీక్షల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని ఆర్‌ఐవో తెలిపారు.

ఆర్‌ఐవో సునీత

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని