‘సంకల్పసిద్ధి’ కీలక ఏజెంట్ల ఖాతాలపై నిఘా..!
సంకల్పసిద్ధి గొలుసుకట్టు సంస్థ మోసాలలో కీలకంగా వ్యవహరించిన ఏజెంట్లపై పోలీసులు దృష్టి సారించారు. వారి ఖాతాలను సీజ్ చేసేందుకు మార్గాలను పరిశీలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
ఇప్పటి వరకు రూ.45కోట్ల ఆస్తుల స్వాధీనం
ఈనాడు, అమరావతి: సంకల్పసిద్ధి గొలుసుకట్టు సంస్థ మోసాలలో కీలకంగా వ్యవహరించిన ఏజెంట్లపై పోలీసులు దృష్టి సారించారు. వారి ఖాతాలను సీజ్ చేసేందుకు మార్గాలను పరిశీలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో ఏజెంట్ల కోసం ప్రత్యేకంగా బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్సు, సీసీఎస్ పోలీసులతో కీలక సమాచారం రాబడుతున్నారు. ఈ కేసులో ప్రధాన పాత్రధారి గుత్తా వేణుగోపాల్‌తో పాటు గుత్తా కిషోర్, గంజాల లక్ష్మి, మావూరి వెంకట నాగలక్ష్మితో పాటు మొత్తం 9మందిని గత ఏడాది నవంబరు 28న అరెస్టు చేశారు. దశల వారీగా ఇప్పటి వరకు మొత్తం 25మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో నవంబరు నాటికి రూ.51.60లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఏజెంట్లు చెల్లించే సొమ్ములకు ప్రత్యేక ఖాతా తెరిచి దీనికి సొంతగా ఒక యాప్‌ను రూపొందించుకున్నారు. దీని ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలి. ఇలా చెల్లించిన సొమ్ము ప్రత్యేక ఖాతాలోకి వెళ్తుంది. వారి సొమ్ము అభివృద్ధి అయినట్లు యాప్‌లో కనిపిస్తుంది. కానీ తిరిగి పొందేందుకు వెనక్కి రాదు. ఈ యాప్ ద్వారా చెల్లింపు, ఎక్కడెక్కడి నుంచి లావాదేవీలు జరిగాయనే విషయాలను సీసీఎస్, సైబర్ క్రైం పోలీసులు పరిశీలిస్తున్నారు.
సంకల్పసిద్ధి కేసు నమోదు చేసిన నుంచి ఇప్పటి వరకు రూ.45 కోట్ల ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కనిగిరి వద్ద నివేశన స్థలాలూ ఇందులో ఉన్నాయి. ఏపీ, తెలంగాణల్లో ఎక్కువగా కోర్ ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరులోనూ వసూలు చేసినా ఫిర్యాదులు అందలేదు. మొదట చేరిన వారు దాదాపు లాభాలు స్వీకరించినట్లు తెలిసింది. భారీగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న సమయంలో ఈ మోసాలు వెలుగు చూశాయి. వసూలు చేసిన సొమ్ము ఎంత ఉంటుందనేది యాప్ వివరాలను బట్టి పోల్చాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
-
General News
Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
-
Sports News
MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..
-
India News
Amritpal Singh: ‘ఆపరేషన్ అమృత్‌పాల్’కు పక్షం రోజులు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు..!
-
Movies News
RRR: ‘ఆస్కార్’కు అందుకే వెళ్లలేదు.. ఆ ఖర్చు గురించి తెలియదు: ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత