logo

రామాపురంలో ఉద్రిక్తత

క్షుద్రపూజలు చేస్తున్నాడనే అనుమానంతో గ్రామస్థులందరూ ఏకమై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని నిలదీసిన సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని రామాపురంలో గురువారం చోటుచేసుకుంది.

Published : 03 Feb 2023 05:03 IST

క్షుద్రపూజలు చేస్తున్నాడనే అనుమానంతో గ్రామస్థుడ్ని నిలదీసిన ప్రజలు

ఊరిలోని రామాలయం వద్దకు చేరిన ప్రజలు

చీరాల అర్బన్‌, న్యూస్‌టుడే: క్షుద్రపూజలు చేస్తున్నాడనే అనుమానంతో గ్రామస్థులందరూ ఏకమై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని నిలదీసిన సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని రామాపురంలో గురువారం చోటుచేసుకుంది. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్థుడు శేషగిరిరావు ఊరిలో ఏవో పూజలు చేస్తున్నాడని... ఇటీవల చేతిలో పసుపు, కుంకుమ తీసుకుని ఇంటింటికీ తిరిగాడని... ఆరోజు నుంచి గ్రామంలో పలువురు అస్వస్థతకు గురయ్యారని ప్రజల ఆరోపణ. ఈ నేపథ్యంలో అతడ్ని నిలదీసి గ్రామంలోని రామాలయం వద్దకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకుని ఈపూరుపాలెం ఎస్సై జనార్దన్‌ అక్కడకు వెళ్లగా గ్రామంలోకి రాకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. విలేకర్లను రానీయలేదు. దీంతో గ్రామీణ సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలతో మాట్లాడారు. ఏదైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని... మీరు ఇలా చేయడం పద్ధతి కాదని చెప్పారు. గ్రామంలో ఏ ఘటన జరిగినా తొలుత పంచాయతీ వేయడం ఆనవాయితీ అని.. అంతేకాని ఇందులో వేరొకటి లేదని వారు పోలీసులకు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని