logo

బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా దేవినేని

బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావును నియమిస్తూ ప్రభుత్వం జీవో నంబరు 62 ద్వారా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది

Published : 04 Feb 2023 06:38 IST

సీఎం వైఎస్‌ జగన్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న దేవినేని మల్లికార్జునరావు

బాపట్ల, రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే: బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావును నియమిస్తూ ప్రభుత్వం జీవో నంబరు 62 ద్వారా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రేపల్లె మండలం రావి అనంతవరం గ్రామానికి చెందిన సీనియర్‌ నేత మల్లికార్జునరావు సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారు. 2004 ఎన్నికల్లో రేపల్లె నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. 2009లో ఆయనకు టిక్కెట్ లభించలేదు. 2013లో తెదేపాలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాలోని 14 మండలాలు, 163 గ్రామాలతో బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ (బౌడా)ని ఏర్పాటు చేస్తూ గత డిసెంబరు 26న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. బౌడా ఛైర్మన్‌ పదవి కోసం పలువురు వైకాపా నేతలు పోటీ పడ్డారు. జిల్లాలో సామాజికవర్గ సమీకరణలను పరిగణనలోకి తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావును ఈ పదవికి ఎంపిక చేశారు. బౌడా ఛైర్మన్‌గా దేవినేని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏడాది పాటు పదవిలో కొనసాగనున్నారు. బౌడా కార్యాలయాన్ని బాపట్ల పురపాలక కార్యాలయంలోనే ఏర్పాటు చేయనున్నారు. వైస్‌ఛైర్మన్‌ను నియమించాల్సి ఉంది. ఛైర్మన్‌గా మల్లికార్జునరావు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని