మదిలో నిలిచాడే.. విశ్వనాథుడు
కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ అస్తమయంతో ఆయన స్వగ్రామం పెదపులివర్రు శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో బాలాత్రిపుర సుందరి సమేత శ్రీనరేంద్రస్వామి, వరదరాజుల స్వామి దేవస్థానాలు ప్రసిద్ధి.
కళాతపస్వి కన్నుమూతతో శోకసంద్రంలో పెదపులివర్రు
భట్టిప్రోలు, న్యూస్‌టుడే
కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ అస్తమయంతో ఆయన స్వగ్రామం పెదపులివర్రు శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో బాలాత్రిపుర సుందరి సమేత శ్రీనరేంద్రస్వామి, వరదరాజుల స్వామి దేవస్థానాలు ప్రసిద్ధి. ఈ దేవాలయంలో ఘంటసాల వెంకటేశ్వరరావు కొంతకాలం పౌరోహిత్యం చేశారు. బాల్యం నుంచి విశ్వనాథ్ ఆ ఆలయంలో పూజలు నిర్వహించేవారు. సినీరంగ ప్రవేశం తర్వాత ఎంత తీరిక లేకున్నా ఏడాదికి రెండుసార్లు పెదపులివర్రుకు వచ్చి స్వామివారిని దర్శించుకుని వస్త్రాలను సమర్పించేవారు.
వరదరాజుల స్వామి దేవస్థానంలో తండ్రి సుబ్రహ్మణ్యం ప్రధాన అర్చకునిగా పనిచేశారు. చిన్నతనంలో తండ్రికి పూజల్లో సహాయంగా ఉండేవారు. కృష్ణానది నుంచి నీరు తీసుకొచ్చి స్వామికి అభిషేకాలు చేస్తుండేవారు. స్వగ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నారు. తండ్రికి 12 ఎకరాల పొలం, పది సెంట్లు నివేశన స్థలం ఉండేది. ఆ స్థలంలో పురాతన పెంకుటిల్లు ఉండేది. తండ్రి పొలం వెళ్లినప్పుడు విశ్వనాథుడు ఆయనతో వెళ్లి మామిడి, ఉసిరి కాయలు కోసి తెచ్చుకునేవారు. చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండేవారని ఆయన సన్నిహిత కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడి నుంచి ఉన్నత విద్యకు తెనాలి, విజయవాడ ప్రాంతాలకు వెళ్లారు. మూడేళ్ల క్రితం చివరిసారిగా గ్రామానికి వచ్చినప్పుడు వరదరాజుల స్వామి ఆలయానికి ఒంటరిగా వచ్చి దర్శించుకున్నారు. సెల్‌ఫోన్ ద్వారా ఆలయాన్ని కుటుంబ సభ్యులకు చూపించారు.
ఇల్లు కొనడం కలిసొచ్చింది
విశ్వనాథుడు జన్మించిన గృహాన్ని తాను కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తున్నా. గ్రామంలో సొంత స్థలం ఉన్నా ఆయన ఇంటిని కావాలనే కొనుక్కున్నా. వారు నివసించిన ఇంట్లోనే చాలాకాలం జీవనం సాగించాం. ఆ స్థలం కొన్న వెంటనే నేను పదేళ్లుగా రూ.5కు కూలీగా పనిచేసిన విద్యుత్తు శాఖలో శాశ్వత ఉద్యోగిగా గుర్తింపు పొందాను. క్రమేణా పక్కా భవనం నిర్మించుకున్నాం.
సజ్జా బసవపున్నయ్య, పెదపులివర్రు
మామిడి కాయలు ఇచ్చేవాడిని
విశ్వనాథుని పొలాల్లో కూలీ పనులు చేశాను. వారు విజయవాడలో ఉన్నప్పుడు వారి తోట నుంచి మామిడి, ఉసిరి కాయలను స్వయంగా తీసుకెళ్లి ఇచ్చేవాడిని. అప్పట్లో భట్టిప్రోలుకు రైలుకి వచ్చేవారు. ఒకసారి రాత్రి సమయం కావడంతో పెదపులివర్రు రావటానికి ఎటువంటి వాహనాలు లేక ఇద్దరం కలిసి నడుచుకుంటూ వచ్చాం. ఆయనతో గడిపిన క్షణాలు నాకు తీపి జ్ఞాపకాలు.
వాకా వెంకటేశ్వర్లు, పెదపులివర్రు
పూజలంటే మహా ఇష్టం
పూజలంటే ఎంతో ఇష్టంగా ఉండేవారు. కార్తికమాసంలో కృష్ణానదిలో పుణ్యం స్నానం చేసేవాళ్లం. చెట్టు నుంచి ఉసిరి కాయలు కోసుకు తినడమంటే ఎంతో ఇష్టపడేవారు. దేవస్థానంలో ఏ పూజలు జరిగినా కావాల్సిన పూలు, ఇతర సామగ్రిని సమకూర్చడంలో ముందుండే వాళ్లం. చివరిసారి కలుసుకున్నప్పుడే ఇక గ్రామానికి రాలేమోనని చెప్పి బాధపడ్డారు. రెండు మూడు నెలలకోసారైనా ఫోన్ చేసి మాట్లాడుకునేవాళ్లం.
కొడమంచిలి వెంకట సుబ్బారావు, పెదపులివర్రు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ap-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..