గుంటూరు రైల్వే డివిజన్‌కు అధిక ప్రాధాన్యం
కేంద్ర బడ్జెట్లో గుంటూరు రైల్వే డివిజన్‌కు అధిక ప్రాధాన్యం లభించిందని మండల రైల్వే అధికారి రామకృష్ణ తెలిపారు. గుంటూరు- బీబీనగర్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు రూ.60 కోట్లు కేటాయించారు
గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్లో గుంటూరు రైల్వే డివిజన్‌కు అధిక ప్రాధాన్యం లభించిందని మండల రైల్వే అధికారి రామకృష్ణ తెలిపారు. గుంటూరు- బీబీనగర్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు రూ.60 కోట్లు కేటాయించారు. గుంటూరు రైల్వే డివిజన్ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రాజెక్టులకు భారీగా సుమారు రూ.1,350 కోట్లు కేటాయించారు. గుంటూరు-గుంతకల్ మార్గం డబ్లింగ్ విద్యుదీకరణకు రూ.980 కోట్లు కేటాయించారు. నడికుడి-శ్రీకాళహస్తి మార్గం డబ్లింగ్ పనులకు రూ.202 కోట్లు మంజూరయ్యాయి. రైళ్ల సగటు వేగాన్ని ఇప్పుడున్న దానికన్నా అదనంగా పెంచేందుకు ట్రాక్ అధునికీకరణకు కేటాయింపులు జరిగాయి. ప్రధాన రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టులు, పాదచారుల వంతెనలు ఏర్పాటు కానున్నాయి. అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు, లెవెల్ క్రాసింగ్‌లకు ప్రత్యామ్నాయంగా యుద్ధ ప్రాతిపదికన రోడ్ అండర్ బ్రిడ్జిలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేయనున్నారు’.. అని వివరించారు. సమావేశంలో ఏడీఆర్‌ఎం శ్రీనివాస్, సీనియర్ డీసీఎం ఆంజనేయులు, సీనియర్ డీఈఎన్(కోఆర్డినేషన్) అనూష పాల్గొన్నారు.
16 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రూ.105 కోట్లు
తొలి దశలో 16 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రూ.105 కోట్లు కేటాయించారు. డిజిటల్ బోర్డులు, చీకట్లు లేని ఎల్‌ఈడీ వెలుగులు, ప్రయాణికుల విశ్రాంతి కోసం లాంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్టేషన్లలో మౌలిక వసతులు కల్పించనున్నారు. డివిజన్ పరిధిలో గుంటూరు, రేపల్లె, నంద్యాల, మంగళగిరి, మార్కాపురం, గిద్దలూరు, పిడుగురాళ్ల నరసరావుపేట, సత్తెనపల్లి, నడికూడి, వినుకొండ, కంభం, నల్గొండ, మిర్యాలగూడ, మాచర్ల, దొనకొండ స్టేషన్లను తొలి దశలో ఎంపిక చేసినట్లు డీఆర్‌ఎం రామకృష్ణ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి