మిర్చి వ్యాపారి కిడ్నాప్ ముఠా అరెస్టు
మిర్చి వ్యాపారి అపహరణ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం పోలీసుస్టేషన్‌లో జరిగిని విలేకరుల సమావేశంలో సీఐ హైమారావు వివరాలు తెలిపారు.
నిందితుల వివరాలు తెలుపుతున్న సీఐ హైమారావు
గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: మిర్చి వ్యాపారి అపహరణ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం పోలీసుస్టేషన్‌లో జరిగిని విలేకరుల సమావేశంలో సీఐ హైమారావు వివరాలు తెలిపారు. ఆమేరకు.. మిర్చి యార్డులో నరేంద్రకుమార్ మిర్చి వ్యాపారం చేస్తుండేవారు. అదే యార్డులో వ్యాపారం చేస్తున్న బర్మా వెంకట్రావు, నరేద్రకుమార్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. వెంకట్రావుకు నరేంద్రకుమార్ అధిక మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇబ్బంది పెట్టడంతో నరేంద్రకుమార్‌ను కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకోవాలని వెంకట్రావు నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో తన అనుచరులైన గుండ్రాల చిన్నబాబు, నూనె క్రాంతికుమార్, పెండెం శ్రీనివాస్‌తో కలిసి అపహరణకు పథకం రచించాడు. 1న నరేంద్రకుమార్ తన ఇంటి నుంచి మిర్చి యార్డుకు బయలుదేరారు.
మార్గమధ్యలో కేకేఆర్ సినిమా హాలు వద్ద బర్మా వెంకట్రావు, అతని అనుచరులు మాటువేసి ఉన్నారు. నరేంద్రకుమార్ అక్కడికి రాగానే అడ్డగించి కొట్టి, బలవంతంగా ఇన్నోవా కారులో ఎక్కించుకొని కోటప్పకొండ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ తమ వద్దనున్న మారణాయుధాలు చూపించి డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించారు. ఘటనపై ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాలతో నగరంపాలెం సీఐ హైమారావు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. నరేంద్రకుమార్‌ను కోటప్ప కొండ వద్ద గుర్తించి కిడ్నాపర్ల చెర నుంచి కాపాడారు. కేసులో ప్రధాన నిందితుడు బర్మా వెంకట్రావును శుక్రవారం రాత్రి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు సీఐ తెలిపారు. అతని అనుచరులు చిన్నబాబు, నూనె క్రాంతికుమార్, పెండెం శ్రీనివాస్‌ను శనివారం నగరంపాలెం వద్ద అరెస్టు చేసినట్లు చెప్పారు. ముఠాలో మరో ఇద్దరున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, వారిని త్వరలో పట్టుకుంటామని సీఐ హైమారావు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh : అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నారా లోకేశ్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Sanjay Raut: ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్ రౌత్
-
Sports News
MS DHONI: ధోనీ 15 ఏళ్ల కిందట ఉన్నంత దూకుడుగా ఉండలేడు కదా: సీఎస్కే కోచ్
-
General News
TSPSC paper leak: సిట్ విచారణకు హాజరైన టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్
-
Politics News
YS Sharmila : బండి సంజయ్, రేవంత్‌రెడ్డికి షర్మిల ఫోన్.. కలిసి పోరాడదామని పిలుపు