logo

దగ్గుమల్లివారిపాలెం సొసైటీలో అక్రమాలు

దగ్గుమల్లివారిపాలెం సొసైటీలో అక్రమాలు జరిగినట్లు సహకార శాఖ అధికారుల విచారణలో తేలింది. సొసైటీలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు సభ్యుడు దగ్గుమల్లి ధర్మారావు అధికారులకు ఫిర్యాదు చేశారు.

Updated : 05 Feb 2023 05:28 IST

నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేల్చిన సహకార శాఖ

బాపట్ల, న్యూస్‌టుడే: దగ్గుమల్లివారిపాలెం సొసైటీలో అక్రమాలు జరిగినట్లు సహకార శాఖ అధికారుల విచారణలో తేలింది. సొసైటీలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు సభ్యుడు దగ్గుమల్లి ధర్మారావు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సహకార శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ఆడిట్ నివేదికలో నిధులు దుర్వినియోగమైనట్లుగా తేల్చారు. మండల పరిధిలోని పడమర బాపట్లలో సొసైటీకి చెందిన భూమిని 216 ఏ జాతీయ రహదారి బైపాస్‌ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ అధికారులు సేకరించి పరిహారం కింద రూ.2.94 కోట్లు అందజేశారు. ఆ మొత్తాన్ని సొసైటీ సభ్యులకు రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు పాలకవర్గం రుణాలుగా అందజేసిందని ఆడిట్ అధికారి విచారణ నివేదికలో పేర్కొన్నారు. 101 మంది సభ్యులకు రూ.1.34 కోట్లు రుణాలుగా ఇచ్చినట్లు విచారణలో తేలినట్లు చూపారు. నిబంధనల ప్రకారం సొసైటీ సభ్యుడికి రూ.500 మాత్రమే రుణం ఇవ్వాలన్నారు. బైలా నిబంధనలకు విరుద్ధంగా పాలకవర్గం వ్యవహరించిందని నివేదికలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని