కారుచౌకగా క్యాంటీన్ అద్దె ఖరారు
జిల్లా ఆస్పత్రిలోని క్యాంటీన్‌ను ఓ గుత్తేదారునికి కారుచౌకగా అద్దెను ఖరారు చేస్తూ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం పలు విమర్శలకు దారి తీస్తోంది.
తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే
ఆస్పత్రి ప్రాంగణంలో క్యాంటీన్ నడిపిన ప్రదేశం ఇదే.
జిల్లా ఆస్పత్రిలోని క్యాంటీన్‌ను ఓ గుత్తేదారునికి కారుచౌకగా అద్దెను ఖరారు చేస్తూ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం పలు విమర్శలకు దారి తీస్తోంది. గతంలో చెల్లించిన నెలసరి అద్దెలో సగానికే దీనిని ఖరారు చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. దీనిలో మితిమీరిన రాజకీయ జోక్యం, టెండర్ నిబంధనలను సక్రమంగా పాటించక పోవడంతో ప్రభుత్వ ఖజనాకు గండి పడుతోందని పలువురు చెబుతున్నారు. చాలా సంవత్సరాల తరవాత టెండర్లు పిలిచిన జిల్లా ఆస్పత్రి వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా రోగులు, వారి సహాయకులు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులకు అల్పాహారం, భోజనం తదితరాలను తయారు చేసి అమ్మేందుకు క్యాంటీన్ నెలకొల్పారు. దాన్ని అద్దె ప్రాతిపదికన నడుపుకొనేందుకు నిర్దేశించిన సంవత్సరాలకు టెండర్ పిలిచి నెలసరి అద్దె ధర ఖరారు చేస్తారు అధికారులు. వారు కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించారా లేదా అని చూసి అన్నీ కచ్చితంగా ఉన్నావారిలో ఎక్కువ అద్దె ధరని కోడ్ చేసిన వారికి దాన్ని ఖరారు చేస్తున్నారు. జిల్లా ఆస్పత్రి అధికారులు కరోనాకు ముందు క్యాంటీన్ బాడుగ ఖరారు టెండర్లను పిలవగా ఓ కాంట్రాక్టరు నెలకి రూ.25వేలు అద్దె చొప్పున కోడ్ చేసి దాన్ని దక్కించుకున్నాడు. అది కాలపరిమితి ముగిసిన తరవాత కరోనా వ్యాప్తి తదితర కారణాలతో మరోసారి టెండర్ పిలవడంలో కొంత జాప్యం చోటు చేసుకుందని ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. ఎట్టకేలకు అధికారులు ఇటీవల అర్హులైన గుత్తేదార్ల నుంచి ఆ భోజన,అల్పాహారశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. వారు వరుసగా నెలసరి అద్దె కింద రూ.40వేలు, రూ.36వేలు, రూ.32వేలు కోడ్ చేశారు..అధికారులు వారు సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించి అర్హులు లేరని నిర్ధారించారు కానీ. అత్యధిక అద్దె ధర రూ.40వేలు కోడ్ చేసిన వారికి దాన్ని ఖరారు చేశారు. కానీ ఆ అద్దె ధర అత్యధికమని భావించి .నాలుగో వంతు ధరకు ఇవ్వమని అధికారులను కలసి కోరారు. దీనికి భిన్నంగా రూ.36వేలు, రూ.32వేలు కోడ్ చేసిన వారు అవే ధరలకు ఇస్తే తీసుకుంటామని కోరినా, ఇవ్వకుండా ఆ టెండర్లను రద్దు చేశారు అధికారులు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు దాన్ని వద్దనుకునేటట్లయితే వారి డిపాజిట్ నగదును అధికారులు వాపసు ఇవ్వరు. కానీ అధికారులే దాన్ని రద్దు పరిచి వారికి నగదును వాపసు ఇచ్చారు. ఆ క్యాంటీన్‌కు తాజాగా మరోసారి టెండర్ పిలిచారు. ఈ సారి నిబంధనల ప్రకారం ధువ్రపత్రాలను సమర్పించిన వారిలో అత్యధిక నెలసరి అద్దె ధర రూ.11,500లు కోడ్ చేసిన వారికి దాన్ని ఖరారు చేశారు. ఇది గతంలో చెల్లించిన రూ.25వేల కన్నా తక్కువ కావడం గమనార్హం.
అధికారులు పాటించిన నిబంధనలతో రూ.40వేలకు టెండర్ దక్కిన గుత్తేదారు తీసుకోకున్నా నగదు వాపసు వచ్చింది. అద్దె ధర బాగా తగ్గింది. ఇక్కడ హాస్పిటల్ కన్నా వ్యక్తికి నష్టం కలగకుండా ఉండేందుకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.. జిల్లా ఆస్పత్రి క్యాంటీన్ అద్దె ధర ఖరారు టెండర్లను ఉన్నతాధికారులే నిర్వహించారు.
టి.సౌభాగ్యవాణి. సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ఏప్రిల్ 3 నుంచి ఏపీలో ఒంటి పూట బడులు : బొత్స
-
Politics News
Nara Lokesh : అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నారా లోకేశ్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Sanjay Raut: ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్ రౌత్
-
Sports News
MS DHONI: ధోనీ 15 ఏళ్ల కిందట ఉన్నంత దూకుడుగా ఉండలేడు కదా: సీఎస్కే కోచ్
-
General News
TSPSC paper leak: సిట్ విచారణకు హాజరైన టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్